శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ ఇదే
సంథ్యథియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు
సంథ్యథియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు.రెండు రోజులుగా మినిమల్ వెంటిలేటర్‌తో శ్రీతేజ్‌కు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. దాదాపు పక్షం రోజుల నుంచి ఆయన ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పెద్దగా మార్పులేదని...
అయితే న్యూరోలాజికల్ స్టేటస్‌లో పెద్దగా మార్పు లేదని వైద్యులు తెలిపారు. పైప్ ద్వారానే శ్రీతేజ్‌కు ఆహారం అందిస్తున్నామని చెప్పారు. ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ తగ్గిందని వైద్యులు తెలిపారు. శ్రీతేజ్ ఆరోగ్యం కుదుట పడుతుందని, అయితే ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదన్నది మాత్రం తాజా బులిటెన్ తో స్పష్టమయింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now