హైదరాబాద్ పోలీస్ "ఆపరేషన్ రోప్"
హైదరాబాద్ పోలీసులు "ఆపరేషన్ రోప్" ను ప్రారంభించారు. ఫిల్మ్ నగర్ నుంచి టోలీచౌకీ మెజిస్టిక్ గార్డెన్ ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు.;
హైదరాబాద్ పోలీసులు "ఆపరేషన్ రోప్" ను ప్రారంభించారు. ఫిల్మ్ నగర్ నుంచి టోలీచౌకీ మెజిస్టిక్ గార్డెన్ ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఫుట్ పాత్ లను ఆక్రమించుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్న వారిని పంపించి వేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రోజుకు కొన్ని లక్షల వాహనాలు రోడ్ల మీదకు వస్తున్నాయని దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఆయన చెప్పారు.
నగరంలోను ఫుట్ పాత్ లపై...
అందుకోసమే నగరంలోని ఫుట్ పాత్ లపై ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని ఈ ఆపరేషన్ రోప్ ద్వారా చేపట్టినట్లు తెలిపారు. నగరమంతా ఆపరేషన్ రోప్ ను నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకు ప్రజలు,రాజకీయనేతల సహకారం అవసరమని సీపీ ఆనంద్ తెలిపారు. తోపుడు బండ్లనుంచి అనేక దుకాణాలు ఫుట్ పాత్ లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారని, అవి తొలగిస్తే తమ జీవనోపాధి దెబ్బతింటుందని చెబుతున్నారని, కానీ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ఆయన అన్నారు. అనేక షాపుల ముందు వ్యాపారాలకు అనుమతిస్తూ పెద్ద మాఫియా నడుస్తుందని సీపీ ఆనంద్ తెలిపారు.