నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం
నిన్న రాత్రి నెలవంక కనిపించడంతో నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుందని ముస్లింపెద్దలు తెలిపారు;
ఈరోజు నుంచి రంజాన్ మాసం ప్రారంభమయింది. నిన్న రాత్రి నెలవంక కనిపించడంతో నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుందని ముస్లింపెద్దలు తెలిపారు. రంజాన్ వరకూ ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేస్తారు. వాటిని నేటి నుంచే చేయనున్నారు.
ఉపవాస దీక్షలు...
రంజాన్ మాసం ప్రారంభం కావడంతో పాతబస్తీలో సందడి ప్రారంభమయింది. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలతో పాటు పెద్దయెత్తున దుకాణాలు కూడా ఫుట్ పాత్ ల మీద వెలిశాయి. ఇక హైదరాబాద్ ఫేమస్ హలీం నేటి నుంచి నగర వాసులకు అందుబాటులోకి రానుంది. రంజాన్ మాసం పూర్తయ్యేంత వరకూ పాతబస్తీలో సందడి నెలకొని ఉంటుంది. ముస్లిం సోదరులు ఈ పండగ కోసం ఏడాది అంతా వేచి చూస్తుంటారు.