జనవరి 1వ తేదీ నుంచి నుమాయిష్

హైదరాబాద్ లో నుమాయిష్ ప్రారంభం కానుంది. నాంపల్లి గ్రౌండ్స్ లో జనవరి ఒకటోతేదీ నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది.

Update: 2024-12-30 04:34 GMT

హైదరాబాద్ లో నుమాయిష్ ప్రారంభం కానుంది. నాంపల్లి గ్రౌండ్స్ లో జనవరి ఒకటోతేదీ నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దాదాపు నలభై రోజులకు పైగానే జరిగే ఎగ్జిబిషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా సందర్శకులు వస్తారు. అనేక ఉత్పత్తులను చౌకగా కొనుగోలు చేసేందుకు ఈ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుంది.


వందల సంఖ్యలో స్టాళ్లు...

ప్రతి ఏటా జనవరి నెలలో ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ కు ప్రతి రోజూ వేలమంది సందర్శకులు వస్తుండటంతో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వందల సంఖ్యలో వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాళ్లను ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాలుగా అనుమతులు తీసుకున్న తర్వాతనే దుకాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఫుడ్ స్టాళ్లతో పాటు అనేక రకాలైన వస్తువులు ఈ ఏడాది ఎగ్జిబిషన్ లో అలరించనున్నాయి





Tags:    

Similar News