Breaking : హైదరాబాద్ లో కాల్పుల కలకలం
హైదరాబాద్ లో కాల్పుల కలకం పోలీసులను ఉరుకులను పరుగులు పెట్టించింది.;
హైదరాబాద్ లో కాల్పుల కలకం పోలీసులను ఉరుకులను పరుగులు పెట్టించింది. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. బండ్లగూడలోని ఇద్దరు హోటళ్ల యజమానుల మధ్య చెలరేగిన ఘర్షణ చివరకు కాల్పులకు దారి తీసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
రెండు వర్గాల మధ్య...
రెండు హోటళ్లు యజమానుల మధ్య చెలరేగిన ఘర్షణతో కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. ఇరువర్గాలు కాల్పులకు తెగపడినట్లు సమాచారం. అయితే ఈ కాల్పుల సందర్భంగా ఎవరికి గాయాలు అయ్యాయి? అన్న దానిపై ఇంకా సమాచారం తెలియలేదు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.