క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

తన సోదరుడు, తాను కలిసి కేపీహెచ్ బీలోని ఓ హాస్టల్ లో ఉంటున్నామని, వారాంతంలో స్నేహితులతో కలిసి క్రికెడ్ ఆడుతామని..;

Update: 2023-05-07 05:42 GMT
software engineer died of heart attack in hyderabad

software engineer died of heart attack in hyderabad

  • whatsapp icon

క్రికెట్ ఆడుతుండగా.. గుండెపోటుకు గురై సాఫ్ట్ వేర్ ఉద్యోగి చనిపోయిన ఘటన హైదరాబాద్ లో శనివారం చోటుచేసుకుంది. వారాంతపు సెలవులు కావడంతో.. మర్రిపూడి మణికంఠ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు కేసీఆర్ స్టేడియంకు వెళ్లాడు. ఆడుతుండగానే గుండెపోటు రావడంతో కారులో పడుకున్నాడు. అతని సోదరుడు వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన మణికంఠ హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

తన సోదరుడు, తాను కలిసి కేపీహెచ్ బీలోని ఓ హాస్టల్ లో ఉంటున్నామని, వారాంతంలో స్నేహితులతో కలిసి క్రికెడ్ ఆడుతామని వెంకటేశ్ తెలిపాడు. శనివారం (మే 6) ఉదయం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్ స్టేడియంలో మ్యాచ్ ఉందని వెళ్లిన మణికంఠ.. మధ్యాహ్నానికి చనిపోయినట్లు అతని స్నేహితుడు యశ్వంత్ ఫోన్ చేసి చెప్పాడన్నారు. క్రికెట్ ఆడుతుండగా మణికంఠ తనకు వెన్నులో నొప్పి వస్తుందని చెప్పి కారులో పడుకున్నాడని, మ్యాచ్ అయిపోయాక ఎంత పిలిచినా పలుకకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మణికంఠ చనిపోయాడని వైద్యులు చెప్పారని యశ్వంత్ చెప్పాడన్నాడు. వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మణికంఠ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.



Tags:    

Similar News