Aamir Khan : ఆమిర్‌ఖాన్ కూతురు పెళ్లికి డేట్, ప్లేస్ ఫిక్స్..

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కూతుర్ని ప్రేమించినవాడికే ఇచ్చి పెళ్లి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వారి వివాహానికి..;

Update: 2023-12-29 12:36 GMT
Aamir Khan, Ira Khan, Ira Khan marriage, Nupur Shikhare, movie news

Ira Khan marriage

  • whatsapp icon
Aamir Khan : బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కూతుర్ని ప్రేమించిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమిర్ కుమార్తె ఐరా ఖాన్‌.. తన ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన నుపుర్ శిఖరేతో ప్రేమలో పడింది. ఇక వారి ప్రేమని అంగీకరించిన ఆమిర్.. 2022 నవంబర్ 18న ఇద్దరికీ నిశ్చితార్థం కూడా పూర్తి చేశారు. ఇప్పుడు 2024 ఇయర్ స్టార్టింగ్ లో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి అవ్వబోతున్నారు.
జనవరి 3న ముంబైలోని 'తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్'లో ఈ వివాహం జరగబోతుందట. ఇక ఈ పెళ్లి పిలుపులను ఆమిర్ ఖాన్ దగ్గరుండి చూసుకుంటున్నారట. ఆయనే అందరికి ఫోన్ చేసి పెళ్లి పిలుపు చెబుతున్నారట. అయితే న్యూ ఇయర్ హాలిడే కావడంతో బాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది హీరోలు.. వాళ్ళ పర్సనల్ ప్లాన్స్ వల్ల పెళ్ళికి హాజరు కాలేకపోతున్నారని సమాచారం. అయితే వారంతా రిసెప్షన్ లో సందడి చేయనున్నారు.
రిసెప్షన్ రెండు సార్లు జరగబోతుంది. ఒకటి ఢిల్లీలో, మరొకటి జైపూర్ లో అని సమాచారం. జనవరి 6-10 మధ్య తేదీల్లో ఈ రెండు రిసెప్షన్స్ జరగనున్నాయట. ఆల్రెడీ ఆమిర్ ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ.. కొత్త జంట ఫ్యామిలీస్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా బాలీవుడ్ అభిమానులంతా ఈ పెళ్లి సెలబ్రేషన్స్ లో ఖాన్‌త్రయం (ఆమిర్, సల్మాన్, షారుఖ్) ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News