హీరోయిన్స్ ఎవరూ ఒప్పుకోలేదు.. పాయల్ కూడా..?

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన RX 100 సినిమా కోసం ముందు అజయ్ భూపతి RX 100 కథని చాలామంది హీరోయిన్స్ కి వినిపించాడట. [more]

Update: 2020-04-01 05:50 GMT

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన RX 100 సినిమా కోసం ముందు అజయ్ భూపతి RX 100 కథని చాలామంది హీరోయిన్స్ కి వినిపించాడట. సినిమాలో హీరోయిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఏ హీరోయిన్ అయినా ఒప్పుకోకపోతుందా.. అని చాలామంది హీరోయిన్స్ కి RX కథ వినిపించా అని.. కానీ ఒక్క హీరోయిన్ కూడా నా సినిమా చేస్తా అనలేదని.. చివరికి వేరే భాషలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజపుట్ ని ఎంచుకున్నామని చెప్పాడు అజయ్ భూపతి.

మరి నెగెటివ్ షేడ్స్ ఉన్న ఇందు పాత్రలో పాయల్ రాజపుట్ ఇరగదీసింది. అయితే పాయల్ సినిమా ఒప్పుకుని కొన్ని రోజుల సినిమా షూటింగ్ కూడా చేసాక.. పాయల్ ఏదో అలా వచ్చి మొక్కుబడిగా షూటింగ్ చేసి వెళ్లిపోయేదని.. దానితో అజయ్ భూపతి మేడం ఈ సినిమా అంత మీ పాత్ర చుట్టూనే తిరిగే కథ కాబట్టి.. ఈ సినిమాకి మీ పాత్రే కీలకం అని చెప్పి.. మీరిలా షూట్ చేస్తే.. సినిమా పోయి అందరూ రోడ్డు మీదకొచ్చేస్తాం అని చెప్పగా… దానితో పాయల్ రాజపుట్ సినిమాలోని ఇందు పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి నటించబట్టే సినిమాలో ఆమెకి మంచి పేరొచ్చింది అని చెబుతున్నాడు. మరి హీరోయిన్స్ ఎవరూ ఇలాంటి పాత్ర ఒప్పుకోకపోవడానికి బలమైన కారణం. ఇందు కేరెక్టర్ లోని నెగెటివ్ షేడ్స్ ఉండడం, అది బోల్డ్ పాత్ర కావడమే అనేది RX 100 చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.

Tags:    

Similar News