ప్రియ ప్రకాష్ సినిమా కోసం అల్లు అర్జున్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఒరు ఆడార్ ల‌వ్‌’ ప్రచార చిత్రంలో కొంటెగా కంటి సైగతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా [more]

;

Update: 2019-01-21 07:55 GMT
priya prakash reply to director
  • whatsapp icon

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘ఒరు ఆడార్ ల‌వ్‌’ ప్రచార చిత్రంలో కొంటెగా కంటి సైగతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాకుండా 2018లో గూగుల్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఒకరిగా ఓ ఘనతను సాధించింది. 'ఒరు ఆడార్ ల‌వ్‌'లో కేవ‌లం 27 సెక‌న్ల పాటు ఆమె చేసిన క‌నుసైగ‌కు రెండు రోజుల్లోనే 45 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ఇప్ప‌టికి రెండు కోట్ల మంది ఆ వీడియో చూశారు. ఇలా ప్రస్తుతం యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ‘ఒరు ఆడార్ ల‌వ్‌’ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదలకు సిద్ధమైంది.

చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్

మలయాళంలో క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎ.గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై ప్రేమికుల దినోత్సవం రోజు అంటే ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మలయాళ వెర్షన్ కూడా అదే రోజున విడుదల కానుంది. జనవరి 23న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు.

Tags:    

Similar News