అల్లు అర్జున్ డామినేషన్?

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో హిట్ తర్వాత సుకుమార్ తో పాన్ ఇండియా లెవెల్ మూవీ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ నాలుగు సినిమాలకే బాలీవుడ్ కి వెళ్లి [more]

Update: 2020-04-13 07:58 GMT

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో హిట్ తర్వాత సుకుమార్ తో పాన్ ఇండియా లెవెల్ మూవీ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ నాలుగు సినిమాలకే బాలీవుడ్ కి వెళ్లి క్రేజ్ కొట్టేసాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మనం మాత్రమే ఎందుకు తగ్గాలని సుకుమార్ ని పుష్ప సినిమా స్క్రిప్ట్ ని పాన్ ఇండియా లెవల్లో మార్చమని ఒత్తిడి చేసాడట. అసలు బన్నీ అల వైకుంఠపురములో ముందు నుండే పాన్ ఇండియా కలలతో ఐకాన్ ని కూడా వేణు శ్రీరామ్ తో పాన్ ఇండియా మూవీగా మార్చమని ఒత్తిడి చేసాడనే న్యూస్ ఉంది.

ఇక సాహో దెబ్బకి అల్లు అర్జున్ కాస్త వెనక్కి తగ్గినప్పటికీ.. అల వైకుంఠపురములో హిట్ తర్వాత అల్లు అర్జున్ కి కాన్ఫిడెన్స్ బాగా పెరిపోయి సుకుమార్ తో పుష్పని పాన్ ఇండియా లెవెల్ కి ప్లాన్ చేయించాడట. సుకుమార్ వర్కౌట్ అవుతుందా అని అడిగినా.. బన్నీ మాత్రం పక్క అవుతుంది ఆలోచించక్కర్లేదని అనడమే కాదు.. ఈ విషయంలో నిర్మాతల దగ్గరనుండి అందరి మీద డామినేషన్ చూపిస్తున్నాడనే టాక్ వినబడుతుంది. మరోపక్క నిర్మాతలైన మైత్రి మూవీస్ వారితో తన మేనమావ ని పార్టనర్ గా చేసాడు. అల్లు అర్జున్ డామినేషన్ తో ఎవ్వరు మట్లాడడం లేదట. అందుకే సుకుమార్ కూడా బడ్జెట్ విషయంలో మైత్రి వారిని ఒప్పించడం, పార్టనర్ గా మొత్తం శెట్టి రవిని కలుపుకోవడం జరిగిందట. మరోపక్క మహేష్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ తో బన్నీ సినిమా చేస్తున్నాడు కాబట్టి.. బన్నీ ఏం చెప్పినా అందరూ ఓకె అంటున్నారని టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. —

Tags:    

Similar News