ట్రయిల్ షూట్ స్టార్ట్ అయ్యిందా?

ఆరు నెలల ముందు స్టార్ట్ కావాల్సిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది. అయితే నవంబర్ నుండి షూటింగ్ షెడ్యూల్ [more]

Update: 2020-09-30 06:13 GMT

ఆరు నెలల ముందు స్టార్ట్ కావాల్సిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది. అయితే నవంబర్ నుండి షూటింగ్ షెడ్యూల్ వేస్తున్నాడట సుకుమార్. నవంబర్ నుండి అన్ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో షూటింగ్ మొదలు పెట్టడానికి సుకుమర్ అండ్ టీం ఇప్పటినుండే కష్టపడుతుంది. కేరళ అడవుల్లో జలపాతాల మధ్యన పుష్ప షూటింగ్ మొదటి షెడ్యూల్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. అయితే షూటింగ్ స్టార్టింగ్ లోనే రెండు భారీ ఫైట్స్ ని చిత్రీకరించాలనే ప్లాన్ లో సుకుమార్ అండ్ బన్నీలు ఉన్నారట.

అయితే ఆ భారీ ఫైట్స్ పెర్ఫక్షన్ కోసం ఇప్పుడు ట్రయిల్ షూట్ మొదలు పెట్టారట. అల్యూమినియం ఫ్యాక్టరీలో పుష్ప సినిమా భారీ ఫైట్స్ సీన్స్ కి సంబందించిన రిహార్సల్స్ మొదలు పెట్టారట. గత రెండు రోజులుగా ఫైట్ మాస్టర్స్ పీటర్ హైన్స్, రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో డూప్స్ మీద, ఫైటర్స్ మీద చిత్రీకరిస్తున్నారట. పుష్ప సినిమాలో రెండు యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ అనేలా ఉంటాయట. అందుకే ఆ రెండు ఫైట్స్ సినిమాలో పర్ఫెక్ట్ గా ఉండాలని.. ఇప్పుడు రిహార్సలస్ చేస్తూ ట్రయిల్ షూట్ చేస్తున్నారట. ఇక ఆ ట్రయిల్ షూట్ లో ఆ రెండు ఫైట్స్ పర్ఫెక్షన్ చూసాక షూటింగ్ చిత్రీకరణ మొదలు పెడతారట సుక్కు – బన్నీలు.

Tags:    

Similar News