రామ్ రెడ్ హీరోయిన్?

ఇస్మార్ట్ శంకర్ లో రామ్ పెద్దగా ఫేమ్ లేని నాభ నటాషా తోనూ, నిధి అగర్వాల్ తోనూ కలిసి రొమాన్స్ చేసాడు. అయితే ఫేమ్ లేదనుకున్న నభ, [more]

Update: 2019-11-02 04:08 GMT

ఇస్మార్ట్ శంకర్ లో రామ్ పెద్దగా ఫేమ్ లేని నాభ నటాషా తోనూ, నిధి అగర్వాల్ తోనూ కలిసి రొమాన్స్ చేసాడు. అయితే ఫేమ్ లేదనుకున్న నభ, నిధి లిద్దరు గ్లామర్ గా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయారు. పూరి ఎలా చెబితే అలా అందాలు ఆరబోయయ్యడంతో… సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్ హాట్ గర్ల్స్ గా ఫెమస్ అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ సరసన నిధి కానీ నాభ కానీ అదరగొట్టేసారు. అయితే తాజాగా రామ్ రెడ్ మూవీ ని కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రీసెంట్ గా మొదలు పెట్టాడు.

అయితే ఈ సినిమా తమిళ తడమ్ సినిమా రీమేక్ అంటూ ప్రచారం జరుగుతుంది. తడమ్ కోలీవుడ్ లో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అయిన సినిమా. తడమ్ సినిమా లో ఐడెంటికల్ ట్విన్స్ అనే కొత్త పాయింట్ తో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. బెంజ్ కార్ లో తిరిగే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ కి చెందిన అబ్బాయి సినీజర్నలిస్టుతో ప్రేమలో పడతాడు. మరి ఇపుడు రెడ్ సినిమాలో రామ్ హీరోయిన్ ఎవరో అంటూ అందరిలో పిచ్చ ఆసక్తి నెలకొంది. మరి తడమ్ రీమేక్ అయితే ఆ సినీజర్నలిస్ట్ గా అనుపమ పరమేశ్వరన్ అయితే బావుంటుందని అంటున్నారు. ఇప్పటికే రామ్ తో ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే సినిమాల్లో నటించింది. మరి రామ్ రెడ్ కోసం హాట్ హీరోయిన్స్ ని తెస్తాడో.. లేదంటే క్యూట్ గర్ల్స్ ని తీసుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News