మామా అల్లుళ్ళ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ 'బ్రో'

పవన్ కళ్యాణ్ - సాయితేజ్ కలిసి నటించిన సినిమా 'బ్రో' . తమిళంలో హిట్ అయిన 'వినోదయా సితం' సినిమాకి ఇది రీమేక్.

Update: 2023-07-22 13:07 GMT

పవన్ కళ్యాణ్ - సాయితేజ్ కలిసి నటించిన సినిమా 'బ్రో' . తమిళంలో హిట్ అయిన 'వినోదయా సితం' సినిమాకి ఇది రీమేక్. దర్శకుడు సముద్రఖని. తెలుగులో ఈ సినిమాకు బాగా మార్పులు చేసేశారు. పవన్ క్రేజ్ కి తగినట్టుగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేను మార్చారు. జులై 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను వదిలారు. తనకి టైమ్ లేదు .. టైమ్ లేదు అంటూ హడావిడి చేసే యువకుడి పాత్రలో తేజు కనిపిస్తాడు. కాలమనే పాత్రలో పవన్ రావడం.. మొత్తం కథ తెలిసిపోతుంది. మామా అల్లుళ్లు కలిసి తొలిసారి స్క్రీన్‌ మీద కలిసి కనిపించి మంచి ఫన్ ను జెనరేట్ చేశారు.

బ్రహ్మానందం కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ప్రియా ప్రకాశ్ వారియర్ - కేతిక శర్మ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. థమన్‌ నేపథ్య సంగీతం బాగా ఉంది. పీపుల్ మీడియా సంస్థ బాగా ఖర్చు పెట్టింది. ట్రైలర్‌ మొత్తం ఫన్ అండ్ ఎమోషన్స్ తో సాగింది. సినిమాలో మామా అల్లుళ్లు ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తారని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

Full View


Tags:    

Similar News