కీర్తి సురేష్ బంపర్ ఆఫర్ కొట్టేసింది..!

నటి కీర్తి సురేష్ గురించి మాట్లాడాలి అంటే మహానటి ముందు ఆ తరువాత అని మాట్లాడాలి. సావిత్రి పాత్రలో ఆమె చేసిన నటన ఇప్పటికీ అందరికి గుర్తే. [more]

;

Update: 2019-03-25 09:08 GMT
keerthi suresh in manmadhudu 2
  • whatsapp icon

నటి కీర్తి సురేష్ గురించి మాట్లాడాలి అంటే మహానటి ముందు ఆ తరువాత అని మాట్లాడాలి. సావిత్రి పాత్రలో ఆమె చేసిన నటన ఇప్పటికీ అందరికి గుర్తే. ఆ సినిమాతో ఆమెకు మంచి పేరు రావడంతో స్టార్ హీరోల సినిమాలలో రెగ్యులర్ పాత్రలను యాక్సెప్ట్ చేయడం లేదని అన్నారు. ఇది కెరీర్ పై ఎఫక్ట్ పడుతుందని కామెంట్స్ చేసారు. కానీ ఇప్పుడు ఆలా లేదు. ఎందుకంటే కీర్తి కోలీవుడ్, టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ స్టార్ హీరో పక్కన చేసే ఛాన్స్ కొట్టేసింది.

డ్యూయల్ రోల్ లో

‘బధాయి హో’ ఫేం అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో అజయ్ దేవగణ్ హీరో కాగా కీర్తిని హీరోయిన్ గా తీసుకున్నారు. స్టోరీ లైన్ కి వస్తే ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు 1953 నుండి 1963 వరకు కోచ్ గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందుతోంది. ఇందులో కీర్తి డ్యూయల్ రోల్ చేయనుంది. మరి సురేష్ బాలీవుడ్ లో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News