పూజ ఒప్పుకుంటుందా?

పూజ హెగ్డే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. ప్రభాస్ తో రాధేశ్యాం తో పూజ హెగ్డే పాన్ ఇండియా హీరోయిన్ లిస్ట్ లోకెళ్లింది. ఇప్పటివరకు తెలుగు, బాలీవుడ్ [more]

Update: 2020-09-07 04:59 GMT

పూజ హెగ్డే ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. ప్రభాస్ తో రాధేశ్యాం తో పూజ హెగ్డే పాన్ ఇండియా హీరోయిన్ లిస్ట్ లోకెళ్లింది. ఇప్పటివరకు తెలుగు, బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్న పూజ హెగ్డే తాజాగా తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అనే టాక్ ఉంది. అయితే పూజ హెగ్డే కి పాత్ర నచ్చితే చిన్న హీరో అని చూడకుండా సినిమా చేసేస్తుంది. ముకుంద లో వరుణ్ తేజ్ తో నటించిన పూజ హెగ్డే తర్వాత హరీష్ శంకర్ అడిగాడని గద్దల కొండా గణేష్ లో మళ్ళీ వరుణ్ తేజ్ పక్కన గెస్ట్ రోల్ లో నటించింది. ఆ శ్రీదేవి పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది. అందుకే పాత్ర నచ్చితే హీరో ఎవరని కూడా పూజ హెగ్డే చూడదంటారు.

అయితే తాజాగా ప్లాప్ హీరో రవితేజ హిట్ దర్శకుడు రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కనున్న ఖిలాడీ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా లో రవితేజకి జోడిగా పూజ హెగ్డే ని సంప్రదిస్తున్నారని అంటున్నారు. రవితేజ చెయ్యబోయే రెండు పాత్రల్లో ఓ పాత్రకి హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకుంటే.. మంచి క్రేజ్ వస్తుంది అని.. సెకండ్ పాత్రకి కాస్త ఫేమ్ ఉన్న హీరోయిన్ అయితే సరిపోతుంది అని దర్శకుడు రమేష్ వర్మ భవిస్తున్నాడట. అయితే పూజ హెగ్డే ఇప్పుడు ప్లాప్ హీరో రవితేజ అని నో చెబుతుంది అని కాదుకానీ…. ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో టాలీవుడ్ లో రెండు సినిమాలు, అలాగే బాలీవుడ్ మూవీస్ కి కమిట్ అవడంతో.. అసలే కరోనా తో అన్ని మూవీస్ ఒకేసారి సెట్స్ మీదకెళ్లడంతో.. పూజ హెగ్డే కి రవితేజ సినిమాచేసే అవకాశం ఉంటుందో లేదో అంటున్నారు.

Tags:    

Similar News