అమెజాన్‌లో వ‌చ్చినా హ‌వా త‌గ్గ‌లేదు..!

తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ దాదాపు అన్నీ అమేజాన్ ప్రైమ్‌ వారే దక్కించుకుంటున్నారు. తెలుగులో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాలు అమేజాన్ [more]

Update: 2019-02-12 08:45 GMT

తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ దాదాపు అన్నీ అమేజాన్ ప్రైమ్‌ వారే దక్కించుకుంటున్నారు. తెలుగులో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాలు అమేజాన్ ప్రైమ్‌ లో కనపడుతున్నాయి. రిలీజ్ అయిన 50 రోజులకి వచ్చేస్తున్నాయి. అలా అయితే పర్లేదు కానీ ఈ మధ్య 30 రోజుల్లోనే అమేజాన్ ప్రైమ్‌లో దర్శనమిస్తున్నాయి. అలానే ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన ఎఫ్ 2 చిత్రం కూడా అమేజాన్ ప్రైమ్‌లో దర్శనమిచ్చింది. ముందే జరిగిన ఒప్పందం ప్రకారం మొన్న అర్ధరాత్రి అమేజాన్ సినిమాను లైవ్ స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా ఇంకా కొన్ని షోస్ హౌస్ ఫుల్ పడుతున్నాయి.

ఇంకా హౌజ్ ఫుల్‌…

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో ఆదివారం నాలుగు షోలకు కలిపి రూ.2.5 లక్షల గ్రాస్ రావడం విశేషం. రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా ఈ సినిమాకి ఇంకా ఇటువంటి కలెక్షన్స్ రావడం అంటే మామూలు విషయం కాదంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇక సోమవారం నుండి ఈ సినిమా ఫ్రీగా చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ డల్లయ్యేందుకు అవకాశముంది. ఏదేమైనా రిలీజ్ అయ్యి నెల రోజులు అవుతున్నా ఇంతలా సినిమా ఆడుతుందంటే దిల్ రాజు అదృష్టమ‌నే చెప్పాలి.

Tags:    

Similar News