క్యాన్సర్ తో పోరాడుతూ ప్రముఖ దర్శకుడు మృతి

రాకేష్ కుమార్ మృతి పట్ల.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. రాకేష్ కుమార్.. ఖూన్ పసినా, దోఔర్దో పాంచ్, మిస్టర్..;

Update: 2022-11-13 12:28 GMT
director rakesh kumar, bollywood director rakesh

director rakesh kumar

  • whatsapp icon

ప్రముఖ బాలీవుడ్ రచయిత, నిర్మాత, దర్శకుడు రాకేష్ కుమార్ (81) క్యాన్సర్ తో మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆయన.. నవంబర్ 10వ తేదీన తుదిశ్వాస విడిచారు. నేడు (ఆదివారం) రాకేష్ కుమార్ సంస్మరణ సభని ఏర్పాటు చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేష్ కుమార్ మృతి పట్ల.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

రాకేష్ కుమార్.. ఖూన్ పసినా, దోఔర్దో పాంచ్, మిస్టర్ నట్వర్ లాల్, యారానా వంటి సినిమాలతో రాకేష్ కుమార్ పాపులర్ అయ్యారు. రాకేష్ కుమార్ కు ఒక భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన మృతి బాలీవుడ్ కి తీరని లోటని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News