మహర్షికి అసలు పరీక్ష మొదలైంది..!

లాంగ్ వీకెండ్ లో రిలీజ్ అయిన మహర్షికి సోమవారం నుండి అసలు పరీక్ష మొదలు కానుంది. పోయిన గురువారం రిలీజ్ అయిన మహర్షి నాలుగు రోజుల్లో బాగానే [more]

;

Update: 2019-05-13 09:04 GMT
maharshi movie collections
  • whatsapp icon

లాంగ్ వీకెండ్ లో రిలీజ్ అయిన మహర్షికి సోమవారం నుండి అసలు పరీక్ష మొదలు కానుంది. పోయిన గురువారం రిలీజ్ అయిన మహర్షి నాలుగు రోజుల్లో బాగానే వసూళ్లు చేసింది. పైగా టికెట్స్ ధరలు కూడా పెంచడం ఈ మూవీకి ప్లస్ అయ్యింది. వీకెండ్ లో నాలుగు రోజుల కలెక్షన్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే అసలు పరీక్ష సోమవారం నుండే.
సోమవారం నుండి వర్కింగ్ డేస్ మొదలవుతాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వీక్ డేస్ లో డ్రాప్ ఉండటం సహజం.

లాభ‌మో న‌ష్ట‌మో…

కాకపోతే ఎంత మోతాదులో ఉంటుంది అనే దాన్ని బట్టే సినిమా కలెక్షన్స్, రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సోమవారం ఉదయం ఆటకి సిటీస్ లో సింగల్ స్క్రీన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయని సమాచారం అందుతుంది. ఫస్ట్ ఫోర్ డేస్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో అన్నది సోమవారం రోజు క్లారిటీ రానుంది. దానిని బట్టి మహర్షి ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది…ప్రాఫిట్ వెంచరా కాదా అనేది తెలుస్తుంది. ఇక ఈ వీకెండ్ లో శుక్రవారం అల్లు శిరీష్ ఏబీసీడీ ఉంది కానీ అది మరీ మహేష్ ని ప్రభావితం చేస్తుందని అనుకోలేం. కలెక్షన్స్ పై దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Tags:    

Similar News