ఫ్లాప్ డైరెక్టర్ ను నమ్ముకున్న రాజ్ తరుణ్

రాజ్ తరుణ్ కి వరుస ఫ్లాప్స్ ఉండటంతో తన మార్కెట్ కూడా బాగా తగ్గిపోయింది. గత ఏడాది వరుసగా మూడు డిజాస్టర్లతో ఉన్న రాజ్ తరుణ్ తో [more]

Update: 2019-05-22 10:15 GMT

రాజ్ తరుణ్ కి వరుస ఫ్లాప్స్ ఉండటంతో తన మార్కెట్ కూడా బాగా తగ్గిపోయింది. గత ఏడాది వరుసగా మూడు డిజాస్టర్లతో ఉన్న రాజ్ తరుణ్ తో సినిమాలు చేయడానికి ఆ తరువాత ఎవరు ముందుకు రాలేదు. కరెక్ట్ గా ఏడాది గ్యాప్ తరువాత మనోడితో సినిమా చేసేందుకు ముందు వచ్చారు నిర్మాతలు. ప్రస్తుతం రాజ్ తరుణ్.. దిల్ రాజు బ్యానర్ లో ఇద్దరి లోకం ఒకటే అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు మరో కొత్త సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు రాజ్ తరుణ్. నితిన్ తో గుండె జారీ గల్లంతయ్యిందే అనే మూవీని దర్శకత్వం చేసి డెబ్యూతోనే సూపర్ హిట్ కొట్టిన కొండా విజయ్ కుమార్ ఆ తరువాత అతని రెండో చిత్రం నాగ చైతన్యతో ఒక లైలా కోసం తీసి ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ దర్శకుడు రాజ్ తరుణ్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

హీరోయిన్ గా నిత్య మీనన్

నిజానికి ఈ కథను విజయ్ మొదట నితిన్ కి వినిపించాడు కానీ అతని నుండి గ్రీన్ సిగ్నల్ ఇంకా రాకపోవడంతో లేట్ ఎందుకు అని అదే కథను రాజ్ తరుణ్ కి వివరించాడు. కథ విన్న రాజ్ తరుణ్ వెంటనే ఓకే చేసేశాడని టాక్. ఒక లైలా కోసం ఫ్లాప్ తర్వాత విజయ్ కుమార్ చాలా గ్యాప్ తీసుకుని ఈ కథను రెడీ చేసుకున్నాడు. ఇది లవ్ స్టోరీనే అని టాక్. తన కన్నా వయస్సులో పెద్దైన అమ్మాయితో ప్రేమలో పడే యువకుడిగా రాజ్ తరుణ్ కనిపిస్తాడని న్యూస్ ఉంది. అందుకే హీరోయిన్ పాత్ర కోసం నిత్య మీనన్ ను తీసుకుందామని అనుకుంటున్నారట. మరి నిత్య ఇందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఇద్దరి లోకం పూర్తి అయ్యాకే ఈ సినిమా స్టార్ట్ అవ్వనుంది.

Tags:    

Similar News