ఈ హీరోయిన్ చాప్టర్ క్లోజ్
పాలబుగ్గల హన్సిక పనైపోయినట్లే. దేశముదురు తో అల్లు అర్జున్ తో నటించిన హన్సిక తర్వాత ఎన్టీఆర్ తోనూ నటించింది. కానీ అమ్మడు లక్కు వేరేలా ఉంది. టాలీవుడ్ [more]
పాలబుగ్గల హన్సిక పనైపోయినట్లే. దేశముదురు తో అల్లు అర్జున్ తో నటించిన హన్సిక తర్వాత ఎన్టీఆర్ తోనూ నటించింది. కానీ అమ్మడు లక్కు వేరేలా ఉంది. టాలీవుడ్ [more]
పాలబుగ్గల హన్సిక పనైపోయినట్లే. దేశముదురు తో అల్లు అర్జున్ తో నటించిన హన్సిక తర్వాత ఎన్టీఆర్ తోనూ నటించింది. కానీ అమ్మడు లక్కు వేరేలా ఉంది. టాలీవుడ్ లో కలిసిరాకపోయినా… తమిళనాట మాత్రం హన్సిక ఓ ఊపు ఊపింది. అయితే బొద్దుగా ఉంటే తమిళ తంబిలకు నచ్చుతుందని…. బొద్దెక్కిన పాల బుగ్గల హన్సిక తర్వాత కెరీర్ లో బాగా డల్ అయ్యింది. తమిళ తంబీల చేత గుడి కట్టించుకున్న ఈ చిన్నది… తర్వాతతర్వాత అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. చిన్న చిన్న హీరోలకు అందుబాటులో కొచ్చేసిన హన్సిక కి ఇప్పుడు అస్సలు కలిసి రావడం లేదు.
తెలుగులో సందీప్ కిషన్ తో అదృష్టాన్ని పరీక్షించుకున్న హన్సికకి తెనాలి రామకృష్ణ కోలుకోలేని దెబ్బకొట్టింది. సినిమా పోవడం, ఆ సినిమాలో హన్సిక కేవలం గ్లామర్ షో కి తప్ప మరి దేనికి ఉపయోగపడకపోవడంతో… అది చూసిన వారికీ హన్సిక కి అవకాశాలు రావని అనిపిస్తుంది. కాస్త లావు తగ్గి గ్లామర్ షో చేసినా… హన్సికకి ఉపయోగం లేదనిపిస్తుంది. సోషల్ మీడియాలో హాటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేసినా హన్సిక కి కలిసొచ్చేలా లేదు. మరి ఇక చిన్న హీరోల సరసన కూడా హన్సికని చూడడానికి ప్రేక్షకులు ఒప్పుకునేలా కనిపించడం లేదు.