అంత ప్రభాసే చేశాడా?
బాహుబలి తో ఒక్కసారిగా ఇండియా వైడ్ గా హీరో అనిపించుకున్న హీరో ప్రభాస్. బాహుబలి పార్ట్ 1, 2 లకు ముందు ప్రభాస్ అంటే ఎవరో తెలియదు. [more]
బాహుబలి తో ఒక్కసారిగా ఇండియా వైడ్ గా హీరో అనిపించుకున్న హీరో ప్రభాస్. బాహుబలి పార్ట్ 1, 2 లకు ముందు ప్రభాస్ అంటే ఎవరో తెలియదు. [more]
బాహుబలి తో ఒక్కసారిగా ఇండియా వైడ్ గా హీరో అనిపించుకున్న హీరో ప్రభాస్. బాహుబలి పార్ట్ 1, 2 లకు ముందు ప్రభాస్ అంటే ఎవరో తెలియదు. కానీ బాహుబలితో నేషనల్ హీరోగా మారిన ప్రభాస్ అదే ఫ్లో ని కంటిన్యూ చెయ్యాలనుకున్నాడు. బాహుబలి క్రేజ్ తో సినిమా చేస్తే పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాడు. అందుకే మంచి కథతో అంటే 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన కథని కాస్త 300 కోట్ల బడ్జెట్ సినిమాగా ప్రభాస్ మార్చేశాడు. సుజిత్ మొదట్లో మీడియం బడ్జెట్ కథతోనే ప్రభాస్ ని కలవడం, ప్రభాస్ ఒప్పుకోవడం జరిగింది. కానీ బాహుబలి ప్రభంజనంలో కొట్టుకుపోయిన ప్రభాస్ కి ఆ 50 కోట్ల బడ్జెట్ ఆనలేదు. అందుకే అదే స్టోరీ లైన్ తో సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ గా మార్చేశాడు. ఎలాగూ యువీ నిర్మాతలు ప్రభాస్ సన్నిహితులే. ప్రభాస్ అడగడమే తరువాయి వారు ప్రభాస్ బాహుబలి క్రేజ్ తో సై అన్నారు.
అలా సాహో సినిమా నేషనల్ వైడ్ గా తెరకెక్కింది. సినిమాని నేషనల్ వైడ్ గా తీస్తున్నామంటే.. బాలీవుడ్ లాంటి పెద్ద మార్కెట్ ఉన్న ప్రేక్షకులను తమ వైపు తిప్పుకోవాలంటే అక్కడి నటులను ఎక్కువగా తీసుకోవాలని ఆలోచించారు. ఆలోచన బాగుంది. కానీ ఆయా నటులను వారు వాడుకున్న తీరు సాహో సినిమా చూస్తే తెలుస్తుంది. చిన్నపాటి సీన్స్ కోసం.. బాలీవుడ్ నుండి పెద్ద నటులను తీసుకున్నారు. ఇక హాలీవుడ్ రేంజ్ యాక్షన్ చూపించాలి అనుకున్నారు…. చూపించారు. అలాగే అన్నిటిలో భారీతనం కొట్టొచ్చినట్లుగా చూపిస్తే ప్రేక్షకులు పడిపోతారనుకున్నారు. కానీ అది కాస్త రివర్స్ అయ్యింది. ఇక హిందీ సినిమాల ప్రమోషన్స్ తో పోలిస్తే సాహో ప్రమోషన్స్ వీక్. తెలుగు, హిందీ లో చేసిన ప్రమోషన్స్ తమిళ, మలయాళంలో చేయలేకపోయారు.
ఇక నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన సాహో సినిమాకి కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు.. అంటే సాహో సినిమా పరిస్థితి ఏమిటో అర్ధమవుతుంది. బాహుబలి ని చూసి వాతలు పెట్టుకుంటే.. చివరికి మిగిలేది అనేది సాహో సినిమా చూపించింది. సినిమాలో కంటెంట్ లేదు, కామెడీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, యాక్షన్ మితిమీరిపోవడం, బలవంతంగా ఇరికించి న లవ్ ట్రాక్ అన్ని సాహో ని ఇరుకున పడేశాయి. అయితే సాహో విషయంలో ఇంత జరగడానికి కేవలం ప్రభాస్ మాత్రమే కారణమవుతాడనేది ఫిలింనగర్ టాక్. చిన్న డైరెక్టర్ చేతిలో ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు పెడితే.. అతను ఎలా హ్యాండిల్ చేస్తడో అనేదీ ప్రభాస్ ఆలోచించాలి. డబ్బుంది కదా అని చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది మరి.