కాజల్ కుమ్మేసింది..!

తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ లక్ష్మీకళ్యాణం సినిమా చేసింది. ఆ సినిమాతో కాజల్ హీరోయిన్ గా కాస్త హైలెట్ అయ్యింది. లక్ష్మీకళ్యాణం ఫ్లాప్ అయినా కాజల్ నటనకు [more]

;

Update: 2019-05-25 06:54 GMT
kajal agarwal in seetha movie
  • whatsapp icon

తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ లక్ష్మీకళ్యాణం సినిమా చేసింది. ఆ సినిమాతో కాజల్ హీరోయిన్ గా కాస్త హైలెట్ అయ్యింది. లక్ష్మీకళ్యాణం ఫ్లాప్ అయినా కాజల్ నటనకు పేరొచ్చింది. తరవాత టాప్ హీరోయిన్ గా మారాక తన మొదటి దర్శకుడు తేజ అడిగాడని నేనె రాజు నేనె మంత్రి సినిమాలో రానాకి జోడిగా నటించింది. ఆ సినిమా హిట్. మళ్లీ తనకి బాగా నచ్చిన సీత కథతో తేజ దర్శకత్వంలో సినిమా చేసింది. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కాజల్ నటన, గ్లామర్ కి ఎంతగా పేరొచ్చిందో తెలిసిందే. ఇక సీతలో కూడా కాజల్ పాత్రే హైలెట్. సీతలో టైటిల్ రోల్ కాజల్ దే. అందుకే ఆ సినిమా ఒప్పుకుంది. సీత సినిమాలో సీత క్యారెక్టర్ లో కాజల్ నటన అద్భుతమే. కాజల్ అగర్వాల్ నటన సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు.

సినిమాకు ఆమే ప్లస్

తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే కాజల్ ఈసారి తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న సీత పాత్రకు కాజల్ అగర్వాల్ బాగానే సూటైంది. కాజల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. కాజల్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అయింది. మరి సీత సినిమా మెయిన్ ప్లస్ పాయింట్ కాజల్. కానీ తేజ డైరెక్షన్ లో పస లేదు. హీరో బెల్లంకొండ తేలిపోవడం, కథ, కథనంలో లోపాలతో సీత సినిమా మాత్రం ప్రేక్షకులకు అంతగా ఎక్కదు. పాపం కాజల్ అందం, గ్లామర్, నటన కూడా సీతని కాపాడలేదనేది ఈ వీకెండ్ లో తెలిసిపోతుంది.

Tags:    

Similar News