కత్రినా కైఫ్, విశాల్ కౌశల్ లను చంపేస్తాం
కత్రినా కైఫ్, విశాల్ కౌశల్ లను చంపేస్తాం.. ఇంతకు ముందు నటుడు సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్లకు కూడా లేఖ రూపంలో బెదిరింపులు వచ్చాయి.
ప్రముఖ బాలీవుడ్ జంట కత్రినా కైఫ్, విశాల్ కౌశల్ లను చంపుతానంటూ సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి హెచ్చరిస్తూ ఉన్నాడు. గుర్తు తెలియని వ్యక్తి పేరిట ముంబై పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై విక్కీ కౌశల్ శాంతాక్రజ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమను బెదిరిస్తున్నట్టు, బెదిరింపు ఇమేజ్ లను పోస్ట్ చేస్తున్నాడంటూ ఆయన తన ఫిర్యాదులో తెలిపాడు. సదరు వ్యక్తి క్రతినా కైఫ్ ను వెంబడిస్తున్నట్టు పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా.. శాంతాక్రజ్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 506-II (నేరపూరిత బెదిరింపు), 354-డి (స్టాకింగ్) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారి తెలిపారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ గతేడాది డిసెంబర్ 9న వివాహం చేసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం వీరు వరుసగా సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉండడం గమనార్హం. ఇటీవలే మాల్దీవుల్లో ఈ జంట విహరించి వచ్చిన విషయం తెలిసిందే.