పోస్ట్ మార్టమ్ బాగానే చేశారట..!
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ.. రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో చిత్ర బృందం మహానాయకుడుపైనే [more]
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ.. రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో చిత్ర బృందం మహానాయకుడుపైనే [more]
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ.. రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో చిత్ర బృందం మహానాయకుడుపైనే ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా ఈ సినిమాను హిట్ చేయాలని చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ ఈ మహానాయకుడిని తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. మహానాయకుడుతో ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్. కథానాయకుడు కొని నష్టపోయిన డిస్ట్రీబ్యూటర్లు, బయ్యర్లకే మహానాయకుడుని అమ్మి వాళ్లకు వచ్చిన నష్టాల్ని లాభాలుగా మార్చాలని ఎన్టీఆర్ మేకర్స్ భావిస్తోన్నారట.
శివరాత్రి కానుకగా…
ఇందులో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు, ట్విస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకి ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మరి ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ మేకర్స్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. అయితే ఇప్పటివరకు మహానాయకుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు ఎన్టీఆర్ టీం. తాజాగా మహానాయకుడు మార్చి 5 మహా శివరాత్రి కానుకగా విడుదలయ్యే సూచనలు ఉన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.