మహేష్ కు భయంగా.. గర్వంగా ఉందట..!

మహేష్ సినిమాలకి బడ్జెట్ పెరిగిపోవడం కామన్ అయిపోయింది. సినిమాకి ముందు అనుకునేది ఒక‌ బడ్జెట్ అయితే తరువాత సెట్స్ మీదకు వెళ్లినప్పుడు ఇంకో బడ్జెట్ అవుతుంది. మహేష్ [more]

Update: 2019-05-05 12:06 GMT

మహేష్ సినిమాలకి బడ్జెట్ పెరిగిపోవడం కామన్ అయిపోయింది. సినిమాకి ముందు అనుకునేది ఒక‌ బడ్జెట్ అయితే తరువాత సెట్స్ మీదకు వెళ్లినప్పుడు ఇంకో బడ్జెట్ అవుతుంది. మహేష్ గత మూడు నాలుగు సినిమాల నుంచి ఇదే జరుగుతుంది. అయితే ‘మహర్షి’ విషయంలో కూడా ఇదే జరిగిందని టాక్ వచ్చింది. ఈ సినిమాకు ముందు అనుకున్న దానికంటే ఎక్కువే అయిందని చెబుతున్నారు. ఈ సినిమాకి దాదాపు 110-120 కోట్ల మేర బడ్జెట్ పెట్టారని ప్రచారమైంది. అయితే తన సినిమాకి బడ్జెట్ పెరగడానికి కారణం ప్రొడ్యూసర్స్ అని అన్నారు మహేష్. మంచి కథ దొరికినప్పుడు క్వాలిటీ పరంగా బడ్జెట్ పెరిగే వీలుందని మహేష్ స్వీయానుభవంతో చెప్పారు. నిన్న జరిగిన ఇంటర్వ్యూ లో మహేష్ మాట్లాడుతూ…నిర్మాతలు కథలు నమ్మి గుడ్డిగా వెళ్తున్నప్పుడు.. బడ్జెట్ పెరగడంలో తప్పులేదని మహేష్ అన్నారు.

బ‌డ్జెట్ అందుకే పెరిగింది

‘మహర్షి’ కథ చాలా పెద్ద స్కోప్ ఉన్న కథ. అమెరికాలో సీఈఓ అంటే సీఈఓ లానే కనిపించాలి. చాలా రిచ్ గా సూటు, బూటు వేసుకుని హెలికాఫ్టర్లలో తిరగడం, రిచ్ కార్లలో తిరగడం వంటివి చాలానే చేయాలి. అందుకే బడ్జెట్ పెరిగింది. అలానే డిసెంబర్ లో రామోజీ ఫిలిం సిటీలో పల్లెటూరు సెట్ వేసి అక్కడ రోజుకి 1000 మంది జూనియర్ ఆర్టిస్టుల తో షూట్ చేశాం. అక్కడ సాయంత్రం 5 గంటలకే లైట్ మొత్తం పడిపోయేది. దాని వల్ల పది రోజులు అదనంగా షూటింగ్ చేయాల్సి వచ్చింది. అక్కడ అలా బడ్జెట్ పెరిగింది. ఇలాంటి రకరకాల కారణాలతో బడ్జెట్ పెరిగిపోతున్నా పెట్టుబడి విషయంలో ఏమాత్రం రాజీ పడని నిర్మాతలు నాకు కుదిరారు. అది నా అదృష్టం అని మహేష్ అన్నారు. బడ్జెట్ 120 కోట్లు అయిందంటే సినిమా 150 కోట్లు దాకా కలెక్ట్ చేయాలి. అప్పుడే సినిమాని బ్లాక్ బస్టర్ అంటాం. నాకు ఒకపక్క 150 కోట్ల మార్కెట్ విషయంలో గర్వంగానూ, భయంగానూ ఉందని మహేష్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News