మహేష్ కోసం సుకుమార్ ఎందుకు ఆగాలి..?

మన టాలీవుడ్ లో డైరెక్టర్స్ ఇమేజ్ కి తగ్గట్టు హీరోస్ వెయిట్ చేయాలి…లేదా హీరోస్ ఇమేజ్ కి తగ్గట్టు డైరెక్టర్స్ వెయిట్ చేయాలి. కేవలం రెండు సినిమాలు [more]

Update: 2019-05-04 07:51 GMT

మన టాలీవుడ్ లో డైరెక్టర్స్ ఇమేజ్ కి తగ్గట్టు హీరోస్ వెయిట్ చేయాలి…లేదా హీరోస్ ఇమేజ్ కి తగ్గట్టు డైరెక్టర్స్ వెయిట్ చేయాలి. కేవలం రెండు సినిమాలు తీసిన అనుభవమున్న సంపత్ నంది అనే చిన్న దర్శకుడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వస్తే చాలా ఎగ్జైట్ అయిపోయాడు. అటు సంపత్ కూడా పవర్ స్టార్ లాంటి స్టార్ హీరో సినిమా కాబట్టి ఏమాత్రం కంప్రమైజ్ కాకుండా ‘గబ్బర్ సింగ్’కు సీక్వెల్ కోసం రెండేళ్లకు పైగా కష్టపడ్డాడు. కాకపోతే చివరికి ఏమైంది పవన్.. సంపత్ ని కాదని బాబీకి ఆ ఛాన్స్ ఇచ్చాడు. అలా సంపత్ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి విషయానికి వస్తే…. ‘మహర్షి’కి ముందు వంశీకి నాలుగు సినిమాలు తీసిన అనుభవం ఉంది అంతే. నాలుగింటిలో ఒక సినిమా ఫ్లాప్. మిగిలిన మూడూ సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి అంతే.

సుకుమార్ కు అవసరం లేదుగా…

మరి ఇటువంటి రికార్డు ఉన్న వంశీకి సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం వంశీ దాదాపు రెండేళ్లు వెయిట్ చేసాడు. అతను వెయిట్ చేయడంలో తప్పులేదు. వంశీతో పోలిస్తే సుకుమార్ రేంజ్ వేరు. సుక్కు ఫ్లాప్ సినిమాకి కూడా తనదైన ముద్ర ఉంటుంది. ఇతని ప్రతి సినిమా ఎగ్జైటింగే. ఈయనతో సినిమా చేయడానికి చాలామంది హీరోస్ వెయిట్ చేస్తుంటారు. సుక్కు హీరోల వెంట పడాల్సిన, వెంపర్లాడాన్సిన అవసరం లేదు. ఏదైనా ప్రాజెక్ట్ లేట్ అవుతుంటే సుక్కు నెలలు, సంవత్సరాలు ఎందుకు ఆగుతాడు? అందులోనూ తన కథకు ఆ హీరో తప్ప మరో ఆల్టర్నేట్ లేకుంటే ఆగడంలో అర్థముంది. అందుకే సుక్కు మహేష్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేయలేదని సుక్కు ఫ్యాన్స్ వాదన. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా నెలలు తరబడి వెయిట్ చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు. చూద్దాం ఫ్యూచర్ లో అయినా వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందేమో.

Tags:    

Similar News