మెగాస్టార్ కు క్యాన్సర్.. కన్ఫ్యూజన్ పై చిరు క్లారిటీ

తనకు క్యాన్సర్ వచ్చిందంటూ వచ్చిన వార్తలపై మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాను అలర్ట్​గా ఉండి..

Update: 2023-06-03 12:53 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని షాకింగ్ విషయం చెప్పారు. అయితే దానిని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకున్నానని, ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. శనివారం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో నిర్వహించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్ కు చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్ పై మాట్లాడుతూ.. తానుకూడా క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని వెల్లడించారు.

తనకు క్యాన్సర్ వచ్చిందంటూ వచ్చిన వార్తలపై మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాను అలర్ట్​గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా non – cancerous polypsను డిటెక్ట్ చేసి.. వాటిని డాక్టర్లు తీసేశారు చిరంజీవి తెలిపారు. ఏఐజీ ఆస్పత్రిలో ఒక వయస్సు దాటిన తర్వాత.. కొలనోస్కోపీ చేయించుకున్నట్లు చిరు చెప్పారు. ఆ రిపోర్ట్‌లో తన శరీరంలోని పాలిప్స్‌ను డాక్టర్లు గుర్తించారని.. ఆ పాలిప్స్‌ను వదిలేస్తే మెలాగ్లిన్ మారే చాన్స్ ఉందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు. 80 నుంచి 90 శాతం పాలిప్స్ మెలాగ్లిన్‌గా మారే అవకాశం ఉంటాయని డాక్టర్లు చెప్పినట్లు మెగాస్టార్ వివరించారు. ముందుగా గుర్తించిన కారణంగా డాక్టర్లు పాలిప్స్ రిమూవ్ చేశారని చెప్పారు. ఈ అవగాహన తనకు లేకపోయి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదో భయమేసిందన్నారు. తనకు అవగాహన ఉండటంతోనే ముందుకు వెళ్లి కొలనోస్కోపీ చేయించుకున్నానని వివరించారు.


Tags:    

Similar News