Chiranjeevi : ఎన్టీఆర్ గారి వల్లే ఆ ఆస్తులు కొన్నాను.. నేడు అవే..

ఎన్టీఆర్ పుణ్య తిథి, ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..;

Update: 2024-01-20 11:00 GMT
Chiranjeevi, Senior NTR, Balakrishna
  • whatsapp icon
Chiranjeevi : లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా నందమూరి తారక రామారావు పుణ్య తిథి, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఆ వేదిక పై చిరంజీవి మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ ని కలిసినప్పుడు జరిగిన ఓ సంఘటనని అందరితో పంచుకున్నారు.
చిరంజీవి కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న సమయంలో ఒకసారి ఎన్టీఆర్ ని కలుసుకున్నారట. ఆ సమయంలో ఎన్టీఆర్, చిరుకి ఓ సలహా ఇచ్చారట. ఎన్టీఆర్ చెప్పిన ఆ సలహా ఏంటంటే.. "సినిమాల్లో సంపాదించే డబ్బుని ఇనుప పెట్టిల్లో, ఇనుప ముక్కలు మీద పెట్టకండి. ఆ డబ్బుతో ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి, లేదా స్థలాలు కొనుకోండి. ఎందుకంటే మనకి వచ్చిన ఈ స్టార్‌డమ్ ఎప్పటివరకు ఉంటుందో ఎవరికి తెలియదు" అంటూ చిరుకి ముందుచూపుతో చెప్పారట.
ఇక అదే సమయంలో చిరంజీవి.. మార్కెట్ లోకి వచ్చిన స్టైలిష్ టయోటా కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారట. కానీ ఎన్టీఆర్ చెప్పిన మాటలకు నిజం గ్రహించిన చిరంజీవి.. కారు కొనాలనే ఆలోచన పక్కన పెట్టేశారట. ఇక అప్పటి నుంచి తన దగ్గర డబ్బు ఉన్న సమయంలో స్థలాలు కొనడం మొదలు పెట్టారట. ఇప్పుడు తనకి వచ్చే రెమ్యూనరేషన్ కంటే ఆ స్థలాలతో వచ్చే సంపాదనే తన ఫామిలీని పోషిస్తున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News