సైరా అక్కడ దుకాణం సర్దేసింది

తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సైరా నార్త్ లో మాత్రం అనుకున్న స్థాయిలో ఆడడంలేదు. బాలీవుడ్ లో ఈమూవీ డిజాస్టర్ గా ముగిసింది. [more]

Update: 2019-10-13 07:14 GMT

తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సైరా నార్త్ లో మాత్రం అనుకున్న స్థాయిలో ఆడడంలేదు. బాలీవుడ్ లో ఈమూవీ డిజాస్టర్ గా ముగిసింది. 10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న సైరా కథ నార్త్ లో దాదాపు ముగిసినట్టే అని చెబుతున్నారు అక్కడ ట్రేడ్ ఎనలిస్ట్ లు.

ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సైరాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈమూవీ అక్కడ కేవలం 10 రోజుల్లో 7 కోట్ల నెట్ మాత్రమే దక్కించుకుంది. మహా అయితే మరో కోటి రూపాయలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 8 కోట్లు లోపే ఈసినిమా నార్త్ లో దుకాణం సద్దుకున్నట్టు అర్ధం అవుతుంది.

అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరో నటించినప్పటికీ ఈసినిమా కేవలం 7 కోట్ల నెట్ మాత్రమే వసూళ్లు చేసింది అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

Tags:    

Similar News