ఎంట్రీ కోసం మోక్షజ్ఞ తిప్పలు..!

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి రాబోతున్నాడని గత రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వట్లేదు బాలయ్య. మోక్షజ్ఞ లావుగా ఉండడంతో [more]

Update: 2018-12-31 06:57 GMT

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి రాబోతున్నాడని గత రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వట్లేదు బాలయ్య. మోక్షజ్ఞ లావుగా ఉండడంతో అతను వెయిట్ తగ్గాలని బాలకృష్ణ తనకు ప్రత్యేకమైన ట్రైనర్స్ ను ఏర్పాటు చేసి వారి వద్ద శిక్షణ ఇప్పిస్తున్నాడట. పలు దేశాల్లో మోక్షజ్ఞ నటన, డాన్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడని మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడని సమాచారం. ఫ్యామిలీ ఈవెంట్స్ లో మోక్షజ్ఞని చూపించకుండా చాలానే ట్రై చేస్తుంది బాలకృష్ణ అండ్ టీం.

వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వాలని…

అక్క తేజస్వి పెళ్లిలో కూడా మోక్షజ్ఞని చూపించలేదు. రీసెంట్ గా జరిగిన ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మోక్షజ్ఞ కనిపించలేదు. హెవీ బాడీతో కనిపిస్తే బాగోదని బాలయ్య భావిస్తున్నాడట. దీంతో మనోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ కొంతమంది కంట పడ్డట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ‘కేజీఎఫ్’ సినిమా ప్రత్యేక షోను తల్లిదండ్రులతో కలిసి చూసేందుకు మోక్షజ్ఞ వచ్చాడట. అక్కడ కొంతమంది చూసి చెబుతున్న ప్రకారం… మోక్షజ్ఞ చాలా లావు తగ్గాడని, సినిమాల్లో వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వాలనే కసితో లావు తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది అని అన్నారు.

వారాహి బ్యానర్ పైనే…

లావు తగ్గడమే కాదు హైట్ గా కూడా ఉన్నాడని చూడటానికి హీరోలా ఉన్నాడని చెబుతున్నారు. కాబట్టి వచ్చే ఏడాదే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండబోతుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ కనిపిస్తాడనే ప్రచారం జరిగినా అవి పుకార్లే అని తేలింది. కానీ మోక్షజ్ఞ వారాహి బ్యానర్ లోనే లాంచ్ అవుతాడని తెలుస్తుంది. అయితే డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. కాబట్టి వచ్చే ఏడాది నందమూరి ఫ్యాన్స్ కు బాలయ్య ట్రీట్ ఇవ్వనున్నాడు.

Tags:    

Similar News