ఓటీటీలోకి ఉగ్రం.. ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..

ఈ సినిమాలో నరేష్ నిజాయితీ గల పోలీస్ అధికారి సీఐ శివగా కనిపిస్తాడు. నరేష్ భార్యగా మిర్నా మేనన్ వస్తుంది. తొలిచూపులోనే..

Update: 2023-05-31 13:11 GMT

ugram ott release

నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నరేష్.. మరోసారి ఆ సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల తోనే ఉగ్రం సినిమా చేశాడు. ఈ సినిమా మే నెల మొదటి వారంలో థియేటర్లో విడుదలవ్వగా.. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చినా.. నరేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. త్వరలోనే ఉగ్రం సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. జూన్ 2వ తేదీ నుంచి ఉగ్రం సినిమా ప్రైమ్ లో స్ట్రీమ్ అవబోతోంది.

ఈ సినిమాలో నరేష్ నిజాయితీ గల పోలీస్ అధికారి సీఐ శివగా కనిపిస్తాడు. నరేష్ భార్యగా మిర్నా మేనన్ వస్తుంది. తొలిచూపులోనే ప్రేమలో పడిన నరేష్.. ఆమె తండ్రిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తుంటారు. వీరికొక పాప. ఇంతలోనే ఓ కారు ప్రమాదం వారి కుటుంబంలో అలజడి రేపుతుంది. శివకు జ్ఞాపక శక్తి పోతుంది. ఈ ప్రమాదం తర్వాత తన భార్య, కూతురు కనిపించకుండా పోతారు. వారితో పాటు నగరంలో చాలామంది ఆడవాళ్లు, యువతులు కిడ్నాప్ అవుతుంటారు. వాళ్లందరినీ శివ ఎలా వెతికిపట్టుకున్నాడు. అసలు శివ కుటుంబానికి కారు ప్రమాదం ఎవరు చేశారు ? ఎందుకు చేశారు? కిడ్నాపర్స్ ను పట్టుకునే క్రమంలో శివకు ఎదురైన సవాళ్లేంటి ? ఇలాంటి ఆసక్తికర విషయాలతో సినిమాను తెరకెక్కించారు.


Tags:    

Similar News