వామ్మో అంతిస్తానన్నా. వద్దందా..?
టాలీవుడ్ లో ఓ బడా నిర్మాత తన కొడుకుని హీరో చెయ్యడానికి… టాప్ దర్శకులను, టాప్ హీరోయిన్స్ ని ఏరికోరి తీసుకొచ్చాడు. ఎలాగైనా హీరోగా నిలబెట్టి… స్టార్ [more]
టాలీవుడ్ లో ఓ బడా నిర్మాత తన కొడుకుని హీరో చెయ్యడానికి… టాప్ దర్శకులను, టాప్ హీరోయిన్స్ ని ఏరికోరి తీసుకొచ్చాడు. ఎలాగైనా హీరోగా నిలబెట్టి… స్టార్ [more]
టాలీవుడ్ లో ఓ బడా నిర్మాత తన కొడుకుని హీరో చెయ్యడానికి… టాప్ దర్శకులను, టాప్ హీరోయిన్స్ ని ఏరికోరి తీసుకొచ్చాడు. ఎలాగైనా హీరోగా నిలబెట్టి… స్టార్ హీరో రేంజ్ కి తన కొడుకుని చేర్చాలనే ప్రయత్నంలో టాప్ రేంజ్ హీరోయిన్స్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకొచ్చాడు. టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగే హీరోయిన్స్ నే ఎక్కువగా తీసుకొచ్చాడా నిర్మాత. ఈపాటికే ఆ నిర్మాత ఎవరు? ఆ హీరో ఎవరు? అనేది అర్ధమయ్యే ఉంటుంది. వాళ్లే నిర్మాత బెల్లంకొండ సురేష్. హీరో శ్రీనివాస్ చిన్న హీరో అయినా.. కొత్త హీరో అయినా బెల్లంకొండ సరసన నటించేందుకు సమంత, కాజల్, పూజ లు భారీగా మొత్తంలో వసూలు చేసి నటించారు. కానీ తాజాగా ఓ టాప్ హీరోయిన్ మాత్రం ఓ కొత్త హీరో పక్కన నటించడానికి కోట్లిస్తానన్నా నో చెప్పిందనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ ఫిలింసర్కిల్స్ ని షేక్ చేస్తుంది.
తమిళనాట బడా వ్యాపారవేత్త కుమారుడైన శరవణన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాకి భారీ హైప్ రావడం కోసం.. కోలీవుడ్ లేడి సూపర్ స్టార్, నెంబర్ వన్ హీరోయిన్ అయినా నయనతార ని సంప్రదించారట. అయితే పిచ్చ క్రేజ్ ఉన్న నయన్.. ప్రస్తుతం పలు సినిమాల్తో బిజీగా ఉండడంతో పాటుగా… కొత్త హీరో తో చెయ్యడానికి నయనతార వెనుకాడిందట. అందుకే ఆ నిర్మాతలకు శరవణన్ పక్కన నటించనని చెప్పేసిందట. అయితే నయనతార ఆ సినిమాలో నటిస్తే సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని… అందుకే ఎలాగైనా నయన్ ని ఒప్పించడానికి… నయన్ కి ఒక్క సినిమాకొచ్చే పారితోషకం కాకుండా రెండు మూడు చిత్రాలకు ఇచ్చే రెమ్యునరేషన్ అంటే దాదాపు 10 కోట్లు ఇస్తామని ఆశచూపారట. అయినా నయన్ నో చెప్పిందట. పది కోట్లిచ్చినా చెయ్యనని చెప్పిన నయన్ ని చూసి ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే కొత్త హీరో అయినా నయన్ చేస్తుంది కానీ… ఆమెకి ఆ సినిమాలో పాత్ర నచ్చకే అంత రెమ్యునరేషన్ ని కాలదన్నుకుందని అంటున్నారు.