కోర్టు మెట్లెక్కనున్న హీరో సుదీప్

కన్నడ స్టార్ హీరో సుదీప్ ఇప్పుడు కోర్టు మెట్లెక్కక తప్పేలా కనబడటం లేదు. కన్నడలో సూపర్ స్టార్ అయిన సుదీప్ తెలుగు, తమిళ భాషల్లోనూ అనేక సినిమాల్లో [more]

Update: 2019-03-28 06:16 GMT

కన్నడ స్టార్ హీరో సుదీప్ ఇప్పుడు కోర్టు మెట్లెక్కక తప్పేలా కనబడటం లేదు. కన్నడలో సూపర్ స్టార్ అయిన సుదీప్ తెలుగు, తమిళ భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించాడు. తెలుగులో రాజమౌళి ఈగ సినిమాలో విలన్ గా అదరగొట్టేసాడు . తాజాగా బాలీవుడ్ దబాంగ్ సీక్వెల్ లోనూ నటిస్తున్న సుదీప్ కి ఒక కేసు మెడకు చుట్టుకుంది. అయితే ఆ కేసులో కోర్టుకి హాజరవకుండా తిరుగుతుండటంతో సుదీప్ ఇప్పుడు తప్పకుండా కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చిక్‌మంగళూరు జేఎంఎఫ్సీ కోర్టు సుదీప్ ఒక్కసారి కూడా కోర్టుకి హాజరు కాకపోవడంతో సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇంతకీ సుదీప్ కోర్టు కథ, కేసు కథ ఏమిటంటే….

కాఫీ తోట ధ్వంసం చేశారని

కర్ణాటక చిక్‌మంగళూరులోని కాఫీ ప్లాంటేషన్ ఓనర్ దీపక్ పటేల్ సుదీప్ పై ఈ కేసు పెట్టాడు. కన్నడ టీవీ రియాలిటీ వారసదార అనే షో కోసం తన ప్రాపర్టీని, కాఫీ తోటల్ని ధ్వంసం చేసినందున ఆ కాఫీ ఎస్టేట్ ఓనర్ కేసు వేసాడు. తనకు కోటిన్నర నష్టం జరిగిందని ఆయన కేసు వెయ్యగా మధ్యవర్తిత్వంతో ఆ కేసు సెటిల్మెంట్ చేసుకుందామనుకుంటే దీపక్ పటేల్ మాత్రం ససేమిరా అనడం, ఆ కేసు విచారణకు వచ్చినప్పుడల్లా సుదీప్ కోర్టుకి హాజరవకుండా తప్పించుకుని తిరగడంతో కోర్టు సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎలాగైనా సుదీప్ ని పట్టుకుని కోర్టులో హాజరుపరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మరి చివరికి సుదీప్ కోర్టు మెట్లెక్కాల్సి వచ్చేలా కనబడుతుంది.

Tags:    

Similar News