ఎందుకు పోయిందో.. తెలుసుకుంటారట..!

గత ఏడాది భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసింది. [more]

Update: 2019-02-28 07:50 GMT

గత ఏడాది భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణ కలిసి రెండు పార్టులుగా తీద్దామని డిసైడ్ అయ్యి.. కథానాయకుడు, మహానాయకుడుగా ఎన్టీఆర్ జీవితాన్ని విభజించారు. ఇక కథానాయకుడు ప్రమోషన్స్ తో పాటే మహానాయకుడు ప్రమోషన్స్ ని ఎన్టీఆర్ బయోపిక్ టీం పర్ఫెక్ట్ గా చేసింది. అందుకే కథానాయకుడు విడుదల సమయానికి ఆ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలు కథానాయకుడు అందుకోలేకపోయింది.

ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో…

ఇక మహానాయకుడుకి ఎన్టీఆర్ టీం ప్రమోషన్స్ చెయ్యలేదు. మరి ఎన్టీఆర్ బయోపిక్ పీఆర్ టీం వైఫల్యమో.. లేదంటే అసలే క్రేజ్ లేదు ప్రమోషన్స్ కి ఖర్చు దండుగ అని మానేశారో.. మహానాయకుడు వచ్చి వారమైనా ఎక్కడా చడీచప్పుడు లేదు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కథానాయకుడు, మహానాయకుడు ఫ్లాప్ అవ్వడానికి కూడా అనేక కారణాలున్నాయి. కథానాయకుడులో ఎన్టీఆర్ ని దేవుడిగా చూపిస్తే.. మహానాయకుడులో చంద్రబాబుని దేవుడిగా చూపించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే రెండు సినిమాలకు ఆ రిజల్ట్ వచ్చింది.

తోచింది తీస్తే ఇలానే ఉంటుంది…

అయితే ఎన్టీఆర్ బయోపిక్ అంత ఘోరంగా ఫ్లాప్ అవడానికి గల కారణం చిత్ర బృందానికి క్లారిటీ రావడం లేదట. అందుకే ఆ కారణం కనుక్కోవడానికి ఎన్టీఆర్ టీం ఇప్పుడు రంగంలోకి దిగిందట. ఎన్టీఆర్ కి భార్యతో ఉన్న అనుబంధాన్ని చూపించినా.. ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు అంటే… ఎన్టీఆర్ జీవితంలో ఎంతో కీలకమైన చివరి ఘట్టాన్ని మాత్రమే ప్రేక్షకులు చూడాలనుకున్నారు. కానీ దాన్ని దాచేసి తోచింది తీస్తే ఇలానే ఉంటుందనే విషయం ఎన్టీఆర్ టీంకి అర్థం కాకపోవడం శోచనీయమే. ఇంత డ్యామేజ్ అయ్యాక ఇప్పడు కారణాలు కోసం బయలు దేరితే ఒరిగేదేమిటి బాలయ్యా.. ఆలోచించు.

Tags:    

Similar News