ఎన్టీఆర్ vs విజయ్ సేతుపతి?

ఆర్.ఆర్.ఆర్ తర్వాత వరస కమిట్మెంట్స్ తో ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. వరసగా పాన్ ఇండియా మూవీస్ నే లైన్ లో పెడుతున్నాడు యంగ్ టైగర్. ఇప్పుడు ఓ పాన్ [more]

Update: 2021-06-17 03:17 GMT

ఆర్.ఆర్.ఆర్ తర్వాత వరస కమిట్మెంట్స్ తో ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. వరసగా పాన్ ఇండియా మూవీస్ నే లైన్ లో పెడుతున్నాడు యంగ్ టైగర్. ఇప్పుడు ఓ పాన్ ఇండియా మూవీలో ఎన్టీఆర్ తో తమిళ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తలపడబోతున్నాడట. విజయ్ సేతుపతి సైరా నరసింహారెడ్డి లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా.. మాస్టర్ లో విలన్ గా చేసినా, 96 లో హీరోగా చేసినా.. ఏ పాత్రనైనా ఆయన అభిమానులు ప్రేమిస్తారు. విజయ్ సేతుపతి అనగానే ఓ స్పెషల్ క్రేజ్ ఆ సినిమాలపై వచ్చేస్తుంది. ఇంతకుముందే పుష్ప పాన్ ఇండియా ఫిల్మ్ లో అల్లు అర్జున్ కి విలన్ గా నటించాల్సి ఉంది. కొన్ని కారణాలతో విజయ్ సేతుపతి ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. తాజాగా విలన్ రోల్స్ కి ఎక్కువ మొగ్గు చూపుతున్న విజయ్ సేతుపతి ఇప్పుడు ఓ పాన్ ఇండియా మూవీ కి విలన్ గా సెట్ అయ్యాడని.. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీలో అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాలతో NTR30 చేసేసి.. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో NTR31 చెయ్యబోతున్న ఎన్టీఆర్ ఈ పాన్ ఇండియా మూవీలో విజయ్ సేతుపతి తో తలపడబోతున్నాడట. అసలు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న సలార్ మూవీ కోసమే విజయ్ సేతుపతి విలన్ గా దించాడని టాక్ నడిచినా ఇప్పుడు ఎన్టీఆర్ కోసం విజయ్ సేతుపతి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ డాన్ లా కనిపిస్తాడని, బయోవార్ నేపథ్యంలో ఈ సినిమా కథ ని ప్రశాంత్ నీల్ డెవెలెప్ చేసాడని,  ప్రపంచాన్నే గడగడలాడించే పవర్‌ఫుల్ మాఫియా డాన్‌లా ఎన్టీఆర్‌ని చూపించబోతున్నాడని టాక్. ఇప్పడు ఇదే మూవీలో విజయ్ సేతుపతి విలన్ అంటూ ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News