పవన్ సినిమాలో క్వీన్ గా జాక్వలిన్!

పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న పిరియాడికల్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో కొద్దిమేర జరిగింది. ప్రస్తుతం ఏకే [more]

Update: 2021-02-04 10:00 GMT

పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న పిరియాడికల్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో కొద్దిమేర జరిగింది. ప్రస్తుతం ఏకే రీమేక్ కోసం క్రిష్ సినిమాకి కొద్దిపాటి విరామం ఇచ్చిన పవన్ కళ్యాణ్ త్వరలోనే క్రిష్ సినిమా సెట్స్ మీదకి వస్తారు. అయితే క్రిష్ పవన్ కోసం అన్ని సెటప్ చేసి పెడుతున్నాడు. ఇప్పటికే క్రిష్ – పవన్ కళ్యాణ్ కాంబోలో ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇంపార్టెంట్ క్వీన్ కేరెక్టర్ కోసం శ్రీలంక బ్యూటీ జక్వాలిన్ ఫెర్నాండేజ్ ని క్రిష్ ఎంపిక చేసాడు. జక్వాలిన్ ఫెర్నాండేజ్ పాత్రని ఓ పవర్ ఫుల్ క్వీన్ గా క్రిష్ చూపించబోతున్నాడు. అంటే జక్వాలిన్ ఫెర్నాండేజ్ ఈ సినిమాలో క్వీన్ గా కనిపించబోతుంది.
అంతే కాకుండా ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో అర్జున్ రామ్ పాల్ కనిపించబోతున్నాడు. జబర్దస్త్ అనసూయకి కూడా ఈ సినిమాలో ఒక అద్భుతమైన కేరెక్టర్ దక్కింది. అది అలాంటి ఇలాంటి పాత్ర కాదు.. పెరఫార్మెన్స్ కి ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయబోతుంది. ఇక ఈ సినిమాని క్రిష్ 170 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్ బడ్జెట్. ఇక ఈ సినిమా టైటిల్ గా హరిహర వీరమల్లు అనే టైటిల్ వాడుకలోకి వచ్చినా.. ఇదే ఫిక్స్ అని అంటున్నా.. ఆ టైటిల్ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదని అందుకే మేకర్స్ మరో టైటిల్ ని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే క్రిష్ – పవన్ కాంబో టైటిల్ గా హరిహర మహాదేవ టైటిల్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది. మరి ఫైనల్ గా క్రిష్ – పవన్ టైటిల్ ఏది ఫిక్స్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News