"హరిహర వీరమల్లు" టీజర్ వచ్చేస్తోంది
హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ పై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొఘల్..;

hari hara veera mallu teaser
పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో తొలిసారి చారిత్రక నేపథ్యంలో నటిస్తోన్న సినిమా "హరిహర వీరమల్లు". దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ సినిమాను ఎ.ఎమ్.రత్నం, ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న వీరమల్లు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో.. వీరమల్లు టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు.
తాజాగా.. టీజర్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. జనవరి 26న టీజర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. చిత్రయూనిట్ కూడా త్వరలోనే టీజర్ రాబోతోందని కొత్తపోస్టర్ ను విడుదల చేసింది. హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ పై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొఘల్ చక్రవర్తుల కాలం నాటి కథ ఆధారంగా తెరకెక్కుతోండగా.. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తుండగా.. నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, సునీల్, సుబ్బరాజు, నోరా ఫతేహి, అనసూయ, పూజిత పొన్నాడ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.