పూనకాలు లోడింగ్ రిలీజ్.. ఇక మాస్ జాతరే

చిరంజీవి - రవితేజపై చిత్రీకరించిన సాంగ్ ను విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్..;

Update: 2022-12-30 14:15 GMT
Poonakalu Loading from Waltair Veerayya

Poonakalu Loading from Waltair Veerayya

  • whatsapp icon

మెగాస్టార్ చిరంజీవి - శృతిహాసన్ జంటగా.. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా నుండి ఈ రోజు (డిసెంబర్ 30) సాయంత్రం చిరంజీవి - రవితేజపై చిత్రీకరించిన సాంగ్ ను విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచగా.. పూనకాలు లోడింగ్ అంటూ వచ్చిన పోస్టర్.. నిజంగానే పూనకాలు తెప్పించేసింది. ఇక తాజాగా పూనకాలు లోడింగ్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ పాట మెగా మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిపోనుంది.

డీఎస్పీ సంగీతం అందించిన ఈ పాటలో.. చిరంజీవి- రవితేజలు కాంట్రాస్ట్ లుక్ కనిపిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కు రెండ్రోజుల ముందే.. డీఎస్పీ న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Full View

Tags:    

Similar News