#RRR లో ప్రభాస్ గెస్ట్ రోల్?

రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో #RRR అనే బడా మల్టీస్టారర్ ని మొదలు పెట్టాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటించడం అంటే [more]

Update: 2019-04-13 06:19 GMT

రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో #RRR అనే బడా మల్టీస్టారర్ ని మొదలు పెట్టాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటించడం అంటే ఆ సినిమా మీద అంచనాలెలా ఉంటాయో అనేది #RRR అనౌన్స్మెంట్ అప్పుడే తెలిసింది. #RRR అనౌన్సమెంట్ నుండే సినిమా మీద భారీ అంచనాలు నెలకొంటే.. #RRR ప్రెస్ మీట్ లో రాజమౌళి చెప్పిన విషయాలతో సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక రామ్ చరణ్ అల్లూరి సీత రామరాజు కేరెక్టర్ లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తో రొమాన్స్ చేస్తుంటే… కొమరం బీమ్ గా ఎన్టీఆర్ #RRR లో నటిస్తున్నాడు. ఇంకా ఎన్టీఆర్ హీరోయిన్ ని రాజమౌళి ఫైనలైజ్ చెయ్యాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం #RRR షూటింగ్ రామ్ చరణ్ కి తగిలిన గాయం వలన బ్రేకిచ్చారు. తాజాగా #RRR పై ఒక కొత్త గాసిప్ ఒకటి టాలీవుడ్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆదేమిటంటే రాజమౌళి బాహుబలితో ప్రభాస్ ని నేషనల్ స్టార్ ని చేసాడు. అలాంటి రాజమౌళి అడిగాడని ప్రభాస్ #RRR లో క్యామియో చేయబోతున్నాడనే న్యూస్ మీడియాలో హైలెట్ అయ్యింది. బాహుబలితో తన క్రేజ్ ని పెంచిన జక్కన్న అడగగానే #RRR లో నటించాడనికి ప్రభాస్ ఒప్పుకున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుండగా. ఈ మల్టీస్టారర్ లో డార్లింగ్ ప్రభాస్ కూడా కలిస్తే సినిమాకి ఇంటెర్నేషనల్ క్రేజ్ రావడం ఖాయమని.. కాకపోతే నిజంగా ఇది సాధ్యమా అంటూ కొందరు డౌట్స్ కూడా రేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సాహో సినిమాతోనూ, రాధాకృష్ణ సినిమాతోనూ నేషనల్ వైడ్ గా నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ #RRR లో నటించే ఛాన్స్ ఎంతవరకు ఉందొ అనేది రాజమౌళి స్పందన బట్టిగాని తెలియదు.

Tags:    

Similar News