విజయ్ అంటే జడుసుకుంటున్న నిర్మాతలు?

విజయ్ అంటే విజయ్ దేవరకొండ అనుకునేరు.. విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి విలక్షణ నటుడు. అందుకే క్రేజీ గా ఆఫర్స్ అందుకుంటూ అదరగడుతున్నాడు. హీరో కేరెక్టర్ కోసం [more]

Update: 2020-05-24 06:59 GMT

విజయ్ అంటే విజయ్ దేవరకొండ అనుకునేరు.. విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి విలక్షణ నటుడు. అందుకే క్రేజీ గా ఆఫర్స్ అందుకుంటూ అదరగడుతున్నాడు. హీరో కేరెక్టర్ కోసం మూడంకె వేసుకుని కూర్చోకుండా కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను, విలన్ గాను ఇలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు విజయ్ సేతుపతి. అయితే విజయ్ సేతుపతి కి భారీ పారితోషకం ఆఫర్ చేస్తే ఏ కేరెక్టర్ అయినా చేస్తాడట. ఇప్పటికే ఉప్పెన సినిమా విలన్ పాత్ర కోసం 7 కోట్లు విజయ్ సేతుపతి పట్టుకెళ్ళిపోతున్నాడట.

ఇక బాలీవుడ్ లోను నటిస్తున్న విజయ్ సేతుపతి ఇప్పుడు పారితోషకం పెంచేసాడట. తన దగ్గరకు వచ్చే నిర్మాతలకు కేరెక్టర్ ఏదైనా 10 కోట్లు కావాలని అడుగుతున్నట్లుగా కోలీవుడ్ మీడియా టాక్. టాలీవుడ్ లో ఏ సినిమా దర్శకనిర్మాత విజయ్ సేతుపతి ని సంప్రదించిన వారిని 10 కోట్ల పారితోషకంతో బెదరగొడుతున్నారట. కొంతమంది నిర్మాతలు సినిమాకే అంత బడ్జెట్ పెట్టడం లేదు.. ఇప్పుడు విజయ్ కి 10 కోట్లా అని నోరెళ్లబెడుతున్నారట. అందుకే కొంతమంది దర్శకనిర్మతలు విజయ్ సేతుపతి ని కలవడానికి కూడా వెనక్కి జంకుతున్నట్లుగా తెలుస్తుంది. స్టార్ హీరోల సినిమాల కోసం కూడా విజయ్ సేతుపతి విషయంలో నిర్మాతలు వెనకాడుతుననట్టుగా తెలుస్తుంది.

Tags:    

Similar News