పుష్ప ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. తగ్గేదే లే..!

ఫస్ట్ డే కలెక్షన్స్ ఊహకు అందనిరీతిలో వసూలయ్యాయి. సినిమా కోసం రెండవ రోజు కూడా థియేటర్ల వద్ద రద్దీ తగ్గలేదు. తొలిరోజు

Update: 2021-12-18 12:18 GMT

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో 12 ఏళ్ల తర్వాత వచ్చిన మూడవ చిత్రం పుష్ప - ది రైజ్. తొలిరోజే ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ తో పాటు.. సినిమాలోని పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దాంతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఊహకు అందనిరీతిలో వసూలయ్యాయి. సినిమా కోసం రెండవ రోజు కూడా థియేటర్ల వద్ద రద్దీ తగ్గలేదు. తొలిరోజు అన్నిభాషల్లో కలిపి పుష్ప సినిమా రూ.70 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాత ఎర్నేని నవీన్ తెలిపారు. మొదటిరోజే ఈ రేంజ్ లో పుష్ప కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ఊహించలేదని, పుష్ప కలెక్షన్స్ ఈ స్థాయిలో రావడం తమ సంస్థకు గర్వకారణమని తెలిపారు నవీన్.


తెలుగు రాష్ట్రాల్లోనే రూ.35 కోట్ల బిజినెస్

ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా బెనిఫిట్ షో ఇవ్వడం తమకు బాగా కలిసొచ్చిందన్నారు. అలాగే వీకెండ్ కావడం, క్రిస్మస్ పండుగ దగ్గర్లో ఉండటంతో.. పుష్ప కలెక్షన్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నామన్నారు నిర్మాతలు. ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. నైజాంలో తొలిరోజు 11 కోట్ల 44 లక్షల కలెక్షన్లు రాబట్టాడు పుష్పరాజ్. అలాగే సీడెడ్ లో 4.20 కోట్లు, ఉత్తరాంధ్రలో కోటి 80 లక్షలు, తూర్పు గోదావరిలో రూ.1.43 కోట్లు, పశ్చిమగోదావరిలో ఒకటిన్నర కోట్లు, గుంటూరులో రూ.2.28 కోట్లు, కృష్ణాజిల్లాలో కోటి 15 లక్షలు, నెల్లూరులో కోటి 10 లక్షలు గ్రాస్ ను సంపాదించింది పుష్ప. మొత్తంమీద తెలుగు రాష్ట్రాల్లోనే 35 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. కర్ణాటకలో 3.65 కోట్లు రాగా.. తమిళనాడులో 1.82 కోట్లు, కేరళలో 1.21కోట్లు, బాలీవుడ్ లో 1.66 కోట్లు పుష్పరాజ్ ఖాతాలో పడ్డాయి. ఓవర్సీస్ లో తొలిరోజు రూ.4.25 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది పుష్ప - ది రైజ్. ఇక త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.




Tags:    

Similar News