నయనతారపై నోరు పారేసుకున్న రాధారవి!

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా చాలామంది కోలీవుడ్ నటుడు రాజకీయపార్టీల ప్రచారంలో హడావిడిగా ఉన్నారు. ఇక ఎప్పుడూ ఏదో ఒక విషయంలో నోరు పారేసుకుంటూ క్రాంట్రవర్సీలకు [more]

Update: 2021-04-01 13:30 GMT

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా చాలామంది కోలీవుడ్ నటుడు రాజకీయపార్టీల ప్రచారంలో హడావిడిగా ఉన్నారు. ఇక ఎప్పుడూ ఏదో ఒక విషయంలో నోరు పారేసుకుంటూ క్రాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండే నటుడు రాధా రవి ఇప్పుడు నయనతార పై నోరు పారేసుకున్నాడు. నయనతార పై రాధా రవి చేసిన వ్యాఖ్యలు అక్కడ ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. నయనతార డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కలిసి సహజీవనం చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
అయినా తాను ఇలాంటివి పట్టించుకోనంటూ చాలా క్యాజువల్ గా రాధారవి.. నయనతార – ఉదయనిధి స్టాలిన్ ల గురించి మాట్లాడేసాడు. రాధారవి చేసిన ఈ కామెంట్స్ ని ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు తప్పుబడుతున్నారు. మరోపక్క డీఎంకే నేతలు రాధారవి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉదయనిధి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాధారవి కేవలం నయనతార – ఉదయ నిధి లనే కాకుండా అటు కమల్ హాసన్ పై కూడా నోరు పారేసుకున్నాడు. ముగ్గురు భార్యలను కాపాడుకోలేని కమల్ ప్రజలను ఏం కాపాడతాడంటూ.. కమలపై ఘాటు వ్యాఖ్యలు చేసాడు రాధారవి.

Tags:    

Similar News