ఎన్టీఆర్ వంతు అయిపోయింది ఇప్పుడు చరణ్..!

మహేష్ కు ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంటే అది ఎన్టీఆర్, రామ్ చరణ్ అని అందరికీ తెలిసిన విషయమే. వీరు ముగ్గురూ [more]

;

Update: 2019-05-14 08:51 GMT
mahesh babu maharshi party
  • whatsapp icon

మహేష్ కు ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంటే అది ఎన్టీఆర్, రామ్ చరణ్ అని అందరికీ తెలిసిన విషయమే. వీరు ముగ్గురూ కలిస్తే ఎంత రచ్చ చేస్తారో వేరే చెప్పనవసరం లేదు. ముగ్గురు మహేష్ సినిమాల సక్సెస్ పార్టీస్ కి కలుసుకుని సందడి చేసిన సంగతి చూసాం. పైగా మహేష్ పార్టీస్ తెగ ఇస్తూ ఉంటాడు. అది కూడా తన ఇంట్లో ఇవ్వడం విశేషం. ప్రస్తుతం మహేష్ మహర్షి సక్సెస్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. అందుకే ఎప్పుడుపడితే అప్పుడు ఎవరికీ అంటే వారికి పార్టీలు ఇస్తున్నాడు.

పారిస్ టూర్ లో చ‌ర‌ణ్‌

ఇక రీసెంట్ గా తన తమ్ముడు అని పిలుచుకునే తారక్ అండ్ ఫామిలీకి పార్టీ ఇచ్చాడు. రీసెంట్ గా మహర్షి పార్టీకి సతీసమేతంగా విచ్చేశాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇప్పుడు అందరి కన్ను రామ్ చరణ్ పైనే. చరణ్ తన భార్యతో కలసి ప్యారిస్ టూర్ లో ఉన్నాడో లేక ఇండియాలోనే ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు కానీ మహేష్‌, ఎన్టీఆర్ తో కలిసి కనిపించకపోతే మాత్రం చ‌ర‌ణ్‌ ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారు. మరి చరణ్ ని మహేష్ ఎప్పుడు ఇన్వైట్ చేస్తాడో.. చరణ్ కాలికి #RRR షూటింగ్ లో దెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News