ఎలాగైనా సినిమాని చూపించేసేలా ఉన్నాడు..!

రామ్ గోపాల వర్మ… ఇప్పుడు ఈ పేరు రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వేడికన్నా ఎక్కువగా నానుతోంది. తానెలా ప్లాన్ చేసుకుంటున్నాడో అలానే మీడియాని వాడుకుంటున్నాడు వర్మ. వర్మ [more]

Update: 2019-03-15 07:28 GMT

రామ్ గోపాల వర్మ… ఇప్పుడు ఈ పేరు రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వేడికన్నా ఎక్కువగా నానుతోంది. తానెలా ప్లాన్ చేసుకుంటున్నాడో అలానే మీడియాని వాడుకుంటున్నాడు వర్మ. వర్మ తెరకెక్కించిన లక్షీస్ ఎన్టీఆర్ సినిమా 22న ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో క్లారిటీ లేదు. అయినా తన సినిమాని ఎలాగైనా విడుదల చేస్తాను.. ఆపే దమ్ము ఎవరికీ ఎంతుందో చూస్తా అంటూ వర్మ సవాళ్లు విసురుతున్నాడు. మరోపక్క ఓ టీడీపీ నేత లక్ష్మీస్ ఎన్టీఆర్ ని నిలిపి వేయాలంటూ ఎన్నికల సంఘం వద్దకు వెళ్లాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కష్టమంటూ మీడియాలో వార్తలు రావడంతో వర్మ ఎలెర్ట్ అయినట్లుగా కనబడుతుంది.

కీలక సన్నివేశాలు లీక్

అందుకే తన సినిమాని ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లి.. టీడీపీని, చంద్రబాబుని, నందమూరి ఫ్యామిలీ ని హోల్ సేల్ గా ఇరికించెయ్యాలని చూస్తున్నాడు. అందుకే కంకణం కట్టుకుని మరీ లక్షీస్ ఎన్టీఆర్ విషయంలో పక్కా వ్యూహాలతో ముందుకెళుతున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ చేసి పారేసాడు. అధికారికంగా ట్రైలర్ ద్వారా విడుదల చేసిన కొన్ని సన్నివేశాలు కాకుండా సినిమా నుండి మరికొన్ని కీలక సీన్లు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో అత్యంత కీలకంగా చెప్పుకునే వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ తాలుకు 6 నిమిషాల కీలక సన్నివేశాలు లీక్ చేశారు.

వర్మనే వదిలాడా..?

అయితే ఈ వీడియోను ఎవరు లీక్ చేశారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. కాకపోతే ఇది రామ్ గోపాల్ వర్మనే కావాలనే లీక్ చేసి ప్రమోషన్ల పేరుతో తన సినిమాను హైలైట్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడనిపిస్తుంది. ఒకవేళ ఈసీ లక్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆపితే.. ఇలా కొన్ని కీలక సీన్స్ వదిలేస్తే.. ఆటోమాటిక్ గా టీడీపీకి, చంద్రబాబుకి పెద్ద దెబ్బే. చూద్దాం వర్మ ప్లాన్స్ లో టీడీపీ ఎంతగా ఇరుక్కుంటుందో అనేది.

Tags:    

Similar News