రకుల్ ని ఫాలో అవుతున్న రాశి..!

మన తెలుగు ప్రేక్షకులకి మరీ లావుగా ఉన్నా ఇష్టం ఉండదు. అలాగ‌ని మరీ బక్కగా ఉన్నా కూడా ఇష్టపడరు. అయితే ఈమధ్య మన హీరోయిన్స్ వెయిట్ లాస్ [more]

Update: 2019-05-06 07:37 GMT

మన తెలుగు ప్రేక్షకులకి మరీ లావుగా ఉన్నా ఇష్టం ఉండదు. అలాగ‌ని మరీ బక్కగా ఉన్నా కూడా ఇష్టపడరు. అయితే ఈమధ్య మన హీరోయిన్స్ వెయిట్ లాస్ గురించి నానారకాలుగా గంటల తరబడి జిమ్‌లో గడుపుతూ తమ అందాన్ని పోగొట్టుకుంటున్నారు. వెయిట్ లాస్ కి, జీరో సైజు కి కొంత లిమిటేషన్ ఉంటుంది. కానీ మన వాళ్లు పేషెంట్ల మాదిరిగా తయారవుతున్నారు. ఇందుకు ఉదాహరణగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని చెప్పుకోవచ్చు. మొదటి నుండే ఈమె కొంచం సన్నగా ఉండేది. కానీ చూడటానికి కొంచం పర్లేదు అనిపించేది. కానీ ఈ మధ్య ఈమె ఫిట్‌నెస్‌ మేనియాలో పడి తన అందాన్నంతా పోగొట్టుకుంది.

బ‌రువు త‌గ్గుతున్న రాశి

దీంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయి తనకన్నా వయసులో చాలా పెద్ద అయిన హీరోల‌తో నటించాల్సి వస్తుంది. ఇప్పుడు రాశీ ఖ‌న్నా కూడా ర‌కుల్ రూట్ లోనే వెళుతోందనిపిస్తోంది. మొదట్లో ఈమె కాస్త బొద్దుగా అనిపించగా ఇప్పుడు ఆ బరువు తగ్గించే ప్రయత్నంలో ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టింది. తగ్గితే మంచిదే కానీ మరీ లిమిట్‌ ఎక్కడనేది తెలియక ఇంకా తగ్గుతూనే ఉంది. అందుకే ఈమెకి కూడా మన తెలుగులో అవకాశాలు తగ్గాయనే టాక్ ఉంది. అనుష్క చూడండి లావుగా కనిపించినా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పైగా మన వాళ్ల‌కి కొంచెం బొద్దుగా ఉంటేనే ఇష్టం. ఇది రకుల్, రాశి గమనిస్తే మంచింది.

Tags:    

Similar News