రష్మిక క్రేజ్ ని వాడుకుంటున్న హీరో

కన్నడలో రష్మిక – రక్షిత్ శెట్టి లు కిర్రాక్ పార్టీ తో సక్సెస్ ఫుల్ గా హీరోహీరోయిన్స్ గా టాప్ లేవల్లోకి వెళ్లడమే కాకుండా.. వారిద్దరూ ఆ [more]

Update: 2019-12-25 05:03 GMT

కన్నడలో రష్మిక – రక్షిత్ శెట్టి లు కిర్రాక్ పార్టీ తో సక్సెస్ ఫుల్ గా హీరోహీరోయిన్స్ గా టాప్ లేవల్లోకి వెళ్లడమే కాకుండా.. వారిద్దరూ ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడడం, వెంటనే ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ జరగడం ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. తర్వాత రష్మిక తెలుగులోకి హిట్ సినిమా తో ఎంట్రీ ఇవ్వడంతో. తర్వాత బ్లాక్ బస్టర్ హీరోయిన్ అవడంతో రష్మిక ప్రియుడు రక్షిత్ తో బ్రేకప్ చేసుకుని అతనికి దూరమైంది. గతం గతః అన్న రేంజ్ లో రష్మిక కెరీర్ లో దూసుకు పోతుంది. ఇక రక్షిత్ శెట్టి కూడా కన్నడలో సినిమాలు చేసుకుంటున్నాడు. తాజాగా అతడే శ్రీమన్నారాయణ సినిమాతో టాలీవుడ్ లోకి రాబోతున్నాడు రక్షిత్. పలు భాషలో విడుదలవుతున్న అతడే శ్రీమన్నారాయణ సినిమా కి తెలుగులో మాత్రం భారీ ప్రమోషన్స్ చేస్తున్నాడు.

బ్రేకప్ ను వాడుకుంటూ….

అయితే టాలీవుడ్ లో తన మాజీ ప్రియురాలి రష్మిక సక్సెస్ ఫుల్ క్రేజ్ ని ఆయుధంగా వాడుకుంటున్నాడు. రష్మిక తో తన బంధం బ్రేకప్ ఎలా అయ్యిందో అంటూ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా చెప్పేస్తూ తన సినిమాపై క్రేజ్ పెంచుకుంటున్నాడు. మాములుగానే టాప్ హీరయిన్ రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ అనగానే అందరిలో క్యూరియాసిటీ ఉంటుంది. ఇక రష్మిక తో తనకున్న ప్రేమ, బ్రేకప్, ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడితే సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ పెంచొచ్చు.. అదే ఇక్కడ రక్షిత్ శెట్టి ప్లాన్. అందులో భాగంగానే రష్మిక ఇపుడు కెరీర్ లో ముందుకు వెళుతుంది. తనతో బ్రేకప్ విషయాలను కెలికి ఆమెని ఇబ్బంది పెట్టొద్దు అంటూ వగలు పోతున్నాడు. మరి రష్మిక క్రేజ్ వాడుకుంటున్న రక్షిత్ శెట్టి కి అతడే శ్రీమన్నారాయణ జనవరి 1 న ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News