రష్మిక డీప్ ఫేక్.. ఆ నలుగురు అరెస్ట్

నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియో ఘటనపై కేసు నమోదు చేసుకున్న

Update: 2023-12-20 08:45 GMT

 RashmikaMandanna

నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియో ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ డీప్‌ఫేక్‌ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో నలుగురు నిందితుల్ని గుర్తించారు ఢిల్లీ పోలీసులు. ఆ నలుగురు ఈ వీడియోను అప్‌లోడ్‌ చేసినట్టు గుర్తించామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు రష్మిక డీప్‌ఫేక్ వీడియోను అప్‌లోడ్ మాత్రమే చేశారని, అయితే వీడియోను రూపొందించడంలో వారి ప్రమేయం లేదని ఆరోపించారు. నలుగురు అనుమానితులలో ముగ్గురిని సోషల్ మీడియా దిగ్గజం మెటా అందించిన వివరాల ఆధారంగా ట్రాక్ చేశారు. నకిలీ వీడియోను సృష్టించిన అసలు నిందితుడి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు ప్రకటించారు.

రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్‌ వీడియో వైరల్ అయిన విష‌యం తెలిసిందే. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రముఖులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత, ఢిల్లీ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్లు 465 (ఫోర్జరీ), 469 (పరువుకు హాని కలిగించడం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్లు 66C (గుర్తింపు దొంగతనం) , 66E (గోప్యతా ఉల్లంఘన) చట్టం, 2000 కింద కేసు నమోదు చేశారు.



Tags:    

Similar News