రష్మిక తెలివే తెలివి

ప్రస్తుతం అందరూ కరోనా తో భయపడి ఇళ్లకే అంకితమవుతూ.. వర్క్ ఫ్రొం హోమ్ అంటూ ఎంప్లొయీస్ కూడా ఇంటికే పరిమితమవుతుంటే.. హీరోలు మాత్రం జిమ్ లో వర్కౌట్ [more]

Update: 2020-03-20 05:54 GMT

ప్రస్తుతం అందరూ కరోనా తో భయపడి ఇళ్లకే అంకితమవుతూ.. వర్క్ ఫ్రొం హోమ్ అంటూ ఎంప్లొయీస్ కూడా ఇంటికే పరిమితమవుతుంటే.. హీరోలు మాత్రం జిమ్ లో వర్కౌట్ చేస్తూ బాడీని ని తగ్గిస్తున్నారు. కొంతమంది హీరోయిన్ కూడా వర్కౌట్స్ చేస్తూ బోడి షేప్ తీసుకొస్తుంటే.. రష్మిక మాత్రం వేరే ప్లాన్ లో బిజీగా ఉంది. కరోనా తో అందరిని కలిసి ఉండొద్దు.. ఎవరిని కలవొద్దు అన్నారు కానీ కథలు వినొద్దు అనలేదుగా అంటుంది. కథలు వినడానికైనా దర్శకుడు, నిర్మాత ఉండాలిగా. అబ్బే అక్కర్లేదు. నాకు మెయిల్ పెడితే చాలు అంటుంది ఈ చిన్నది. సరిలేరు, భీష్మ తో భారీ హిట్ కొట్టిన రష్మిక అల్లు అర్జున్ – సుక్కు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా కోసం రష్మిక పేరు పరిశీలనలో ఉండగా.. కరోనాతో షూటింగ్స్ క్యాన్సిల్ అయి ఇంట్లో ఉన్న రష్మిక సరికొత్త ప్లాన్స్ వేస్తుంది.

అది దర్శకులను మంచి కథలను తమ మెయిల్ కి పంపితే అవి గనక నచ్చితే ఓకె చేస్తా అంటూ బంపర్ ఆఫర్ ఇవ్వడమే కాదు.. వారికీ తన మెయిల్ ఐడి ఇచ్చి మరి.. వారికీ కబురు చేస్తుంది. ఇక కథలు పంపితే వాటిని తన టీం చేత డిస్కస్ చేసి చెబుతా అని,… తన టీం చాల చిన్నది కాబట్టి కథని ఓకె చెయ్యడానికి టైం కావాలని.. కాబట్టి కథలు పంపిన వారిని టైం కూడా అడుగుతుంది. ఇక ఇప్పటివరకు హీరోలే కథలు వినడానికి ఆసక్తి చూపడం, దర్శకనిర్మాతలు హీరోలకే కథలు చెప్పడానికి ట్రై చేసేవారు. కానీ కొత్తగా అవకాశాల జోరు కోసం రష్మిక ఇలా కథలు వినాలని, కరొనతో ఖాళీ టైం ని ఇలా స్పెండ్ చెయ్యాలని రష్మిక ప్లాన్ అన్నమాట.

Tags:    

Similar News