‘ఎవరు’ లో రెజినా విశ్వరూపం అంట

కెరీర్ స్టార్టింగ్ లో డీసెంట్ హిట్స్ తో మంచి పాపులారిటీ దక్కించుకున్న రెజినా కసాండ్రా అప్పటిలో ఒక ఊపు ఊపేసింది. స్టార్ హీరోస్ తో నటించకపోయినప్పటికీ మీడియం [more]

Update: 2019-07-19 06:18 GMT

కెరీర్ స్టార్టింగ్ లో డీసెంట్ హిట్స్ తో మంచి పాపులారిటీ దక్కించుకున్న రెజినా కసాండ్రా అప్పటిలో ఒక ఊపు ఊపేసింది. స్టార్ హీరోస్ తో నటించకపోయినప్పటికీ మీడియం రేంజ్ సినిమాల్లో మంచి ఆఫర్స్ దక్కించుకుంది. ఆ తరువాత తమిళంలో వరస ఆఫర్స్ రావడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. ఆమధ్య ‘అ!’ సినిమాతో మెప్పించి చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ‘7’ అనే సినిమాతో నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమెకు తమిళంలో రెండు మూడు సినిమాలు తప్ప ఏమి లేవు. తెలుగు లో మాత్రం అడివి శేష్ ‘ఎవరు’ ఒక్కటే ఉంది.

ఈచిత్రాన్ని వెంకట్ రాంజీ డైరెక్ట్ చేయనున్నాడు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈసినిమా ఓ హాలీవుడ్ మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసుకుని చేస్తుంది. ఇక ‘గూఢచారి’ లాంటి స్పై థ్రిల్లర్ తో ఆడియన్స్ ను మెప్పించిన అడివి శేష్ నెక్స్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఎక్కువే ఉంది. ఈ సినిమా హిట్ అవ్వడం హీరోయిన్ రెజినా కి కూడా చాలా అవసరం. అందుకే ఈసినిమాలో ఆమె గ్లామర్ పరంగా విశ్వరూపం చూపించనుందని టాక్ వస్తుంది. రెజీనా ఘాటు అందాలు ఈ సినిమాకు ఒక హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈసినిమాతో ఎట్టిపరిస్థితుల్లో సక్సెస్ అందుకోని టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ దక్కించుకోవాలని ట్రై చేస్తుంది. ఈమూవీని ఆగష్టు 15 న రిలీజ్ చేయనున్నారు.

Tags:    

Similar News