బాలీవూడ్ కే ఇంత సమర్పిస్తే.. మరి హాలీవుడ్ కి…?

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ #RRR సినిమా గురించే. సినిమా అనౌన్సమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అదే క్రేజ్ ట్రేడ్ లో, ప్రేక్షకుల్లోనూ ఉంది. టాప్ [more]

Update: 2019-03-16 09:51 GMT

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ #RRR సినిమా గురించే. సినిమా అనౌన్సమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అదే క్రేజ్ ట్రేడ్ లో, ప్రేక్షకుల్లోనూ ఉంది. టాప్ స్టార్ హీరోస్ కలిసి నటించడమే ఇందుకు కారణం. #RRRపై ఏ చిన్న అప్ డేట్ బయటికొచ్చినా అదే పనిగా హాట్ టాపిక్ అవుతుంది. మొన్నటి #RRR సినిమా ప్రెస్ మీట్ బోలెడన్ని విషయాలను రాజమౌళి చెప్పేసాడు. బహు భారీ ప్రాజెక్ట్ గా #RRR తెరకెక్కుతోందని, ఎన్టీఆర్.. కొమరం భీమ్ గా, రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తారని రాజమౌళి ప్రకటించారు. హీరోయిన్స్ గా చరణ్ కి అలియా భట్, ఎన్టీఆర్ కి హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తారని, ఇంకా అజయ్ దేవగన్, సముద్రఖని కీలకపాత్రలు చేస్తున్నారని, అలాగే #RRR కథపై కూడా క్లారిటీ ఇచ్చిన రాజమౌళి #RRR గురించి అబ్బో చాలా విషయాలే రివీల్ చేసాడు.

ఆలియాకు 10-12 కోట్లు

ఇక రామ్ చరణ్ కి బాలీవుడ్ హీరోయిన్ ని దింపిన రాజమౌళి బృందం ఆమె కోసం భారీ పారితోషకం సమర్పించుకుంటున్నారట. అలియా క్రేజ్, డిమాండ్ ని బట్టి ఆమెకి 10 నుండి 12 కోట్ల వరకు ఇచ్చుకుంటున్నారనే న్యూస్ నిన్న వైరల్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్స్ కి ఆ రేంజ్ పారితోషకాలు కామనే. అందులోనూ అలియా సూపర్ హిట్స్ తో భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉంది. మరి బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కే #RRR టీం అంత సమర్పిస్తే… ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ కి ఎంత సమర్పరించాల్సి వస్తుందో..? అనేది ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో నడుస్తున్న టాపిక్.

డైసీ రెమ్యునరేషన్ ఎంతో..?

అయితే ఈ హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో నటించలేదు. గత ఏడాది ఒకే ఒక్క సినిమా పాండ్ లైఫ్ లో నటించింది. మరి సినిమాల్లో పెద్దగా పాపులర్ కాని ఈ డైసీ ఎడ్గార్ జోన్స్ టీవీ సిరీస్‌లతో పేరు సంపాదించింది. కోల్డ్‌ ఫీట్‌, వార్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌, జెంటిల్‌మాన్‌ జాక్‌ లాంటి టీవీ సీరీస్ తో డైసీ ఎడ్గార్ జోన్స్ బాగా పాపులర్ అయ్యింది. మరి ఎక్కువ సినిమాలు చేయకుండా వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించిన ఈ చిన్నది ఇప్పుడు #RRR లో ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. మరి ఈ హీరోయిన్ డైసీకి #RRR టీం ఎంత పారితోషకం ఇస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News